iDreamPost

BTech పాసై ఖాళీగా ఉన్నారా? లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్స్ కు వెంటనే అప్లై చేసుకోండి

మీరు బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

BTech పాసై ఖాళీగా ఉన్నారా? లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్స్ కు వెంటనే అప్లై చేసుకోండి

సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారు బీటెక్ విద్యను అభ్యసించేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. ఐటీ జాబ్స్ కు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇక కొత్తగా బీటెక్ పాసైన వారికి ఐటీ సంస్థల్లో జాబ్ దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో బీటెక్ ఉత్తీర్ణులైన వారికి నేషనల్ పెర్టిలైజర్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

నోయిడాలోని నేషనల్ పెర్టిలైజర్స్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో మేనేజ్ మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 164 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి 60శాతం మార్కులతో బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000 జీతం అందుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 164

విభాగాల వారీగా ఖాళీలు:

  • మేనేజ్ మెంట్ ట్రైనీ కెమికల్: 56
  • మేనేజ్ మెంట్ ట్రైనీ మెకానికల్: 18
  • మేనేజ్ మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్: 21
  • మేనేజ్ మెంట్ ట్రైనీ ఇన్ స్ట్రుమెంటేషన్: 17
  • మేనేజ్ మెంట్ ట్రైనీ కెమికల్ ల్యాబ్: 12
  • మేనేజ్ మెంట్ ట్రైనీ సివిల్: 3
  • మేనేజ్ మెంట్ ట్రైనీ ఫైర్ అండ్ సేఫ్టీ: 5
  • మేనేజ్ మెంట్ ట్రైనీ ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ: 5
  • మేనేజ్ మెంట్ ట్రైనీ మెటీరియల్స్: 11
  • మేనేజ్ మెంట్ ట్రైనీ హెచ్ ఆర్: 16

అర్హత:

  • పోస్టులను అనుసరించి 60శాతం మార్కులతో బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 18-27 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 40,000-1,40,000 జీతం అందిస్తారు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్య్వూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ. 700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభం:

  • 12-06-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 02-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి