iDreamPost

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటంటే?

తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైంది.

తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమైంది.

తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటంటే?

తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి నాణ్యమైన విద్యనందిస్తోంది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరం అని భావించిన ప్రభుత్వం గురుకులాల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎల్‌, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. అర్హులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చూసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు డిసెంబరు 18 2023 నుంచి జనవరి 6 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tgcet.cgg.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

అర్హత:

  • విద్యార్ధులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతుండాలి. అయితే జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికైతే మాత్రం సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో తప్పనిసరిగా చదువుతూ ఉండాలి.

వయోపరిమితి:

  • ఓసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

ఆదాయ పరిమితి:

  • విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 18-12-2023

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 06-01-2024

ప్రవేశ పరీక్ష తేది:

  • 11-02-2024

అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి