iDreamPost

ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. Ola ఈ-స్కూటర్లపై రూ. 25 వేల తగ్గింపు.. త్వరపడండి

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా బంపరాఫర్ ప్రకటించింది. ఈ-స్కూటర్లపై ఏకంగా రూ. 25 వేలు డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎప్పటి వరకు అందుబాటులో ఉండనున్నాయంటే?

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా బంపరాఫర్ ప్రకటించింది. ఈ-స్కూటర్లపై ఏకంగా రూ. 25 వేలు డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లు ఎప్పటి వరకు అందుబాటులో ఉండనున్నాయంటే?

ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు.. Ola ఈ-స్కూటర్లపై రూ. 25 వేల తగ్గింపు.. త్వరపడండి

పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. బడ్జెట్ ధరల్లో ఈ స్కూటర్లు లభించడం, పర్యావరణ హితంగా ఉండడం, సింగిల్ ఛార్జ్ తోనే 150, 200 కి. మీల రేంజ్ ఉండడంతో వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ల అభిరుచులకు తగిన విధంగా అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నాయి టూ వీలర్ తయారీ సంస్థలు. కస్టమర్లను ఆకట్టుకుని సేల్స్ పెంచుకునేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా తన కస్టమర్ల కోసం బంపరాఫర్ ను ప్రకటించింది. ఆ మోడల్ స్కూటర్లపై ఏకంగా రూ. 25 వేలు తగ్గించింది. దీనికి సంబంధించి కంపెనీ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.

ఈ మధ్య మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవచ్చు. ఎస్1 సిరీస్ పై రూ.25వేల భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లను ఫిబ్రవరి 16 నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్లు ఫిబ్రవరి నెల వరకే అందుబాటులో ఉండనున్నాయి. ఎస్1 ప్రో, ఎస్ ఎయిర్, ఎస్1 ఎక్స్ ప్లస్ మోడళ్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. తగ్గింపు ధరలతో.. ఎస్1 ప్రో మోడల్ ధర ప్రస్తుతం రూ.1,47,499గా ఉండగా.. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.1.29 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.

అదే విధంగా ఎస్1 ఎయిర్ మోడల్ ధర ప్రస్తుతం 1.19 లక్షలు ఉండగా.. డిస్కౌంట్ తర్వాత ఈ స్కూటర్ రూ.1.04 లక్షలకే అందిస్తోంది. ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ ప్రస్తుత ధర రూ.1.09 లక్షలు ఉంది. తగ్గింపు తర్వాత ఇది రూ.84,999కి లభిస్తుంది. వీటితో పాటు ఇంకెన్నో ప్రయోజనాలు కూడా కొనుగోలు దారులు పొందనున్నారు. జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజులు విధిస్తోంది. ఆకర్షణీయ స్థాయిలో 7.99 శాతం మాత్రమే వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ లో ఓలా టాప్ లో దూసుకెళ్తోంది. తాజాగా ప్రకటించిన ఆఫర్లతో కొనుగోళ్లు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి