iDreamPost

New Year Celebrations 2024:31 రాత్రి అదిరిపోయే పార్టీ.. తిన్నంత తిండి.. ఎక్కడంటే..

  • Published Dec 29, 2023 | 2:07 PMUpdated Dec 29, 2023 | 4:47 PM

New Year Celebrations 2024: కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు ఘనంగా సిద్ధం అవుతోంది. అయితే, ఈ వేడుకలను తక్కువ బడ్జెట్ తో ఎంజాయ్ చేయాలి అనుకునే వారు ఇక్కడికి వెళ్తే సరిపోతుంది.

New Year Celebrations 2024: కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు ఘనంగా సిద్ధం అవుతోంది. అయితే, ఈ వేడుకలను తక్కువ బడ్జెట్ తో ఎంజాయ్ చేయాలి అనుకునే వారు ఇక్కడికి వెళ్తే సరిపోతుంది.

  • Published Dec 29, 2023 | 2:07 PMUpdated Dec 29, 2023 | 4:47 PM
New Year Celebrations 2024:31 రాత్రి అదిరిపోయే పార్టీ.. తిన్నంత తిండి.. ఎక్కడంటే..

మరో రెండు రోజుల్లో అంతటా పండగ వాతావరణం కనిపించబోతుంది. రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో ముందుండేది యువత. ఇప్పటికే దానికి సంబంధించి ప్లాన్స్ చేస్తూనే ఉండి ఉంటారు. ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కు మహా నగరాలలోని హోటల్స్, రెస్టారెంట్స్ , పబ్స్ ఇలా అన్నీ సిద్ధం అవుతున్నాయి. పోలీసులు కూడా ముందుగానే దీనికి సంభందించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, చాలా మందికి సెలెబ్రేషన్స్ అంటే ఇష్టం ఉంటుంది.. కానీ బడ్జెట్ చూస్తే భయమేస్తుంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ తో సెలెబ్రేషన్స్ ను చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని హోటల్ ది పార్క్ లో.. బిగ్ బాష్ NYE 2024 “3-స్టేజ్ న్యూ ఇయర్” పేరుతో ఒక ఈవెంట్ ను నిర్వహించనుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను బాగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పి తీరాలి. ఈ ఈవెంట్ ను డిసెంబర్ 31 రాత్రి 7 గంటలకు ప్రారంభించనున్నారు. కాగా, ఈ ఈవెంట్ 5 గంటల 30 నిమిషాల పాటు కొనసాగనుంది. అయితే, ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వారికీ హోటల్ యాజమాన్యం కొన్ని ఆఫర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో పాల్గొనాలి అనుకునే వారికీ ఎంట్రీ ఫీ రూ.999 నుండి ప్రారంభం అవుతుందని వారు తెలియజేశారు. ఆ పార్టీలో వారు అన్‌లిమిటెడ్ ఫుడ్ మెనూను, బాలీవుడ్ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయొచ్చని చెప్పారు. అయితే, ఈ బిగ్ బాష్ NYE 2024 “3-స్టేజ్ న్యూ ఇయర్” పేరుకు తగినట్టుగానే మొత్తంగా త్రి స్టేజెస్ లో ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

EB PASS.. ఈ పాస్ ను స్త్రీలు, పురుషులు విడివిడిగా తీసుకుంటే త్రి స్టేజెస్ లో ఒకటైన ఎర్త్ స్టేజ్ కు అనుమతి ఉంటుంది. అక్కడ అన్‌లిమిటెడ్ IMFL డ్రింక్స్, 3 వెజ్, నాన్ వెజ్ స్టార్టర్స్, 2 మెయిన్ కోర్స్, 2 డిజర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే EB COUPLES PASS.. ఈ పాస్ తీసుకుంటే ఎర్త్ స్టేజ్ లో ఉన్న అన్నిటికి యాక్సెస్ ఉంటుంది. EB VIP PASS.. ఈ పాస్ తీసుకుంటే మొత్తం త్రి స్టేజెస్ కు యాక్సెస్ లభిస్తుంది. ఇక్కడ కూడా అన్‌లిమిటెడ్ ఫుడ్, డ్రింక్ కోర్స్ ను ఎంజాయ్ చేయొచ్చు. దీనితో పాటు బాలీవుడ్ ఎలక్ట్రానిక్ డాన్స్, మ్యూజిక్ ను ఎంజాయ్ చేయొచ్చు . అలాగే VIP COUPLE PASS కూడా త్రి స్టేజెస్ కు యాక్సెస్ లభిస్తుంది. ఇక వీటితో పాటు VVIP COUPLE(SEATED) పాస్ కూడా అందుబాటులో ఉంది. ఈ పాస్ ల ధరలు అన్నీ కూడా సదుపాయాలకు తగిన విధంగా ఉన్నాయి.

ఇలా మొత్తంగా త్రి స్టేజెస్ లో ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయనున్నారు. పైగా ఈ ఈవెంట్ కు అటెండ్ అవ్వాలంటే కొన్ని రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. రూల్స్ విషయానికొస్తే 21 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే ఈ టికెట్స్ ను కొనుగోలు చేసేందుకు అర్హులు. టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తులు టికెట్ తో పాటూ చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్‌ను కూడా తీసుకుని వెళ్ళాలి. కాబట్టి న్యూ ఇయర్ ను ఫుల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయాలి అనుకునేవారు.. ఈ బిగ్ బాష్ NYE 2024 “3-స్టేజ్ న్యూ ఇయర్” ఈవెంట్ ను అటెండ్ అవ్వాల్సిందే. మరి, ది పార్క్ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి