iDreamPost

ఐస్ క్రీం ప్రియులకు షాకుల మీద షాకులు.. మొన్న వేలు.. ఈరోజు..!

మొన్నటికి మొన్న ఓ డాక్టర్ ఐస్ క్రీం తిందామని ఆర్డర్ చేస్తే ఐస్ క్రీంకి తోడు చేతి వేలు ఫ్రీగా అందించిందో కంపెనీ. ఇప్పుడు ఏకంగా ఓ జీవాన్నే పంపించింది మరో కంపెనీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

మొన్నటికి మొన్న ఓ డాక్టర్ ఐస్ క్రీం తిందామని ఆర్డర్ చేస్తే ఐస్ క్రీంకి తోడు చేతి వేలు ఫ్రీగా అందించిందో కంపెనీ. ఇప్పుడు ఏకంగా ఓ జీవాన్నే పంపించింది మరో కంపెనీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ఐస్ క్రీం ప్రియులకు షాకుల మీద షాకులు.. మొన్న వేలు.. ఈరోజు..!

బయట ఫుడ్ అంటే భయపడేలా చేస్తున్నాయి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. ఇటీవల తెలంగాణలో ఫుడ్  కార్పొరేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో పెద్ద పెద్ద హోటల్లో జరుగుతున్న ఫుడ్ కల్తీ వెలుగులోకి వచ్చింది. పాడైపోయిన ఉత్పత్తులు, బూజు పట్టిన ఆహార పదార్థాలు, పురుగుల సంచరిస్తున్న వంటి గదులను చూసి వాంతి చేసుకున్నంత పని అయ్యింది.  అయినా రెండు రోజుల ముచ్చట్లే. కస్టమర్లు హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లడం మానలేదు. ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా.. ఫుడ్ అంటే ఓ ఎమోషన్ అయిపోయి వెనక్కు తగ్గట్లేదు. కొంత మంది అంబియన్స్ నచ్చి వెళ్లి..  లొట్టలేసుకుని తిని వస్తున్నారు. ఇవి చూసిన మరికొంత మంది అక్కడకు వెళ్లడం ఎందుకు లే అని ఆర్డర్ పెట్టుకుంటున్నారు.

ఇక  ఇంటికి వచ్చిన ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల్లో పిన్నులు, సూదులు, క్రిములు, కీటకాలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్ ఐస్ క్రీమ్ తిందామని ఆర్డర్ చేస్తే.. ఠక్కున వచ్చింది.  ఆగలేక ఐస్ క్రీం తిందామని తీస్తే.. చేతి వేలు వచ్చింది. దీన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయిన సంగతి విదితమే. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు సదరు డాక్టర్.  ఈ ఘటన మర్చిపోక ముందు ఇప్పుడు మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ నోయిడా సిటీలోని సెక్టార్-12 లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీపాదేవి అనే మహిళ ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ బ్లింకిట్‌ ద్వారా అమూల్ ఐస్‌క్రీమ్‌ బుక్‌ చేసింది.

ఆర్డర్ తీసి చూసే సరికి అందులో జెర్రి దర్శనమిచ్చింది. దాంతో షాకవడం ఆమె వంతైంది. తన ఐదేళ్ల కుమారుడికి మ్యాంగో షేక్‌ చేసేందుకు అమూల్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేశామని, రాగానే ఓపెన్‌ చేయగా అందులో జెర్రి కనిపించిందని దీపాదేవి.  ఆ జెర్రి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. దీనిపై దీపాదేవి బ్లింకిట్‌కు కంప్లెయింట్‌ చేసింది. దాంతో దీపాదేవి చెల్లించిన రూ.195ను బ్లింకిట్‌ రీఫండ్ చేసింది. అదేవిధంగా ఈ విషయాన్ని అమూల్‌ ఐస్‌క్రీమ్‌ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చింది.  ప్రముఖ కంపెనీ అమూల్ ఐస్ క్రీంలో ఇలా ఉంటే.. మిగిలిన కంపెనీ ప్రొడక్ట్స్ పరిస్థితి ఏంటనీ అనుకుంటున్నారు నెటిజన్లు. ఐస్ క్రీం ప్రియులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి