iDreamPost

ఈ ఛాన్స్‌ మళ్లీ రాదు.. రాత పరీక్ష లేకుండానే NHAI లో ఉద్యోగాలు.. రూ.2,15,000 జీతం..

  • Published Jun 15, 2024 | 12:05 PMUpdated Jun 15, 2024 | 12:05 PM

NHAI: ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావిస్తున్నారా.. అది కూడా మంచి సాలరీతో. అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌హెచ్‌ఏఐలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెల్లడించింది. ఆ వివరాలు..

NHAI: ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావిస్తున్నారా.. అది కూడా మంచి సాలరీతో. అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌హెచ్‌ఏఐలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Jun 15, 2024 | 12:05 PMUpdated Jun 15, 2024 | 12:05 PM
ఈ ఛాన్స్‌ మళ్లీ రాదు.. రాత పరీక్ష లేకుండానే NHAI లో ఉద్యోగాలు.. రూ.2,15,000 జీతం..

చదువుకునే దశలో విద్యార్థుల్లో ఉండే బలమైన కోరిక ఏంటంటే.. బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో సెటిల్‌ అవ్వాలి. ఇక నేటి కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీ ఎత్తున జీతాలు ఇచ్చే ఉద్యోగాలు అనేకం వచ్చాయి. అయితే ప్రైవేటు ఉద్యోగాల్లో లక్షల్లో ప్యాకేజీ ఇచ్చినా.. సరే.. చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలంటేనే ఆసక్తి చూపుతున్నారు. ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతుంటారు. ఇక గవర్నమెంట్‌ జాబ్ అంటే అంత ఈజీ కాదు. ఎన్నో వడపోతలు దాటితేనే ఉద్యోగం లభిస్తుంది. గవర్నమెంట్‌ జాబ్‌ అంటే కచ్చితంగా రాత పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధించాలి. అప్పుడే ఉద్యోగం మిమ్మల్ని వరిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించకుండా.. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే సెలక్ట్‌ చేస్తున్నారు. అలాంటి ఓ జాబ్‌ నోటిఫికేషన్‌ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.

కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనరల్ మేనేజర్ (లీగల్), డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్), మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్‌హెచ్‌ఐ అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 8.

పోస్టుల వివరాలు..

ఎన్‌హెచ్‌ఏఐ రిక్రూట్‌మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, క్రింద ఇవ్వబడిన పోస్ట్‌లలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

  • జనరల్ మేనేజర్ (లీగల్)-2
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్)-1
  • మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)-3
  • అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)-3

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 56 ఏళ్లు మించకూడదు.

జీతం

  • జనరల్ మేనేజర్ (లీగల్) – రూ. 1,23,100-రూ. 2,15,900 వరకు ఉంటుంది.
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్) – రూ. 78,800-రూ. 20,9200
  • మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) – రూ 15,600-రూ 39,100
  • అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్) – రూ 9,300-రూ 34,800

ఎంపిక ప్రక్రియ

NHAIలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

ఈ అడ్రస్‌కి పంపాలి

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేస్తున్న వారు తమ దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా నింపి సంబంధిత పత్రాలతో పాటు క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి.

అడ్రెస్‌:

DGM (HR/Admin)-III నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్లాట్ నెం. G5-&6, సెక్టార్-10, ద్వారక, న్యూఢిల్లీ-110075

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి