iDreamPost

సక్సెస్ ఇచ్చారు కానీ వేచి చూస్తున్నారు

సక్సెస్ ఇచ్చారు కానీ వేచి చూస్తున్నారు

ఒకప్పుడు అంటే ఓ ముప్పై నలభై ఏళ్ళు వెనక్కు వెళ్తే దర్శకుడు ఎవరైనా సరే వాళ్లకు హిట్ ఉంటే చాలు నిర్మాతలు క్యూలో నిలబడే వారు. దానికి తగ్గట్టే డైరెక్టర్లు కూడా చాలా ప్లాన్డ్ గా తమ కెరీర్ ని సెట్ చేసుకుని వీలైనన్ని ఎక్కువ సినిమాలు తీసేవారు. ఈ కారణంగానే దాసరి నారాయణరావు గారు 150, కోడిరామకృష్ణ రాఘవేంద్ర రావు లాంటి అగ్ర దర్శకులు 100 కు పైగా చిత్రాలను తమ కీర్తి పతాకంలో నింపుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏడాదికి ఒకటి చేయడం గగనమైపోతోంది. హీరోల వేగం తగ్గడంతో పాటు నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో గతంలోలా ఫాస్ట్ గా సినిమాలు తీసి రిలీజ్ చేయడం సాధ్యం కావడం లేదు.

Also Read: పెద్ద సినిమాల కళ్ళు గోపిచంద్ మీదే

ఇది కొందరికి జాప్యంగా మారి విలువైన కాలం ఖాళీగా ఉండేలా చేస్తోంది. ఉదాహరణకు ఉప్పెన రిలీజై ఆరు నెలలు దాటింది. దర్శకుడు బుచ్చిబాబు కొత్త ప్రాజెక్ట్ ఇప్పటిదాకా మొదలుకాలేదు. జూనియర్ ఎన్టీఆర్ సానుకూలంగా ఉన్నాడని టాక్ వచ్చింది కానీ తీరా చూస్తే అతనేమో కొరటాల శివతో లాక్ అయ్యాడు. వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా ఉందన్నారు కానీ దానికి సంబంధించిన ప్రకటన కానీ లీక్ కానీ ఇప్పటిదాకా రాలేదు. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి రెండేళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ నిర్మాత దిల్ రాజు కాంబో ఇప్పటికి సెట్ అయ్యింది కానీ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

గతంలో రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టక సుకుమార్ కూడా ఇదే తరహాలో వెయిట్ చేశారు. మహేష్ బాబుతో అనుకుంటే ఆఖరికి అల్లు అర్జున్ తో పుష్ప సెట్ అయ్యింది. ఆ మూడేళ్ళ గ్యాప్ లో ఏదైనా సినిమా తీసుంటే ఈజీగా ఓ వంద కోట్ల ప్రాజెక్ట్ అయ్యేది. కానీ మిస్ అయ్యింది. సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న త్రినాధరావు నక్కిన సైతం హలో గురు ప్రేమ కోసమే తర్వాత చాలా ఎదురు చూడాల్సి వచ్చింది. రవితేజ ఓకే చెప్పాక కూడా అడుగులు వేగంగా కదల్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నారు. హిట్టు కొట్టినా కూడా ఇలా జరగడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. పరిస్థితులు అంతగా మారిపోయాయి మరి

Also Read: మోహన్ బాబుకు మెగాబ్రదర్ ప్రశ్నలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి