పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సభ ప్రారంభంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్ర అభివృద్ధి బిల్లు–2020 పై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు, చరిత్రపై మట్లాడుతుండగా టీడీపీ సభ్యులు తమ నిరసనను ప్రారంభించారు.
మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు.. అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మొదట నుంచి టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సభ ప్రారంభమైన 20 నిమిషాలకే తమ డిమాండ్‌ను వినిపిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. కాగా, చరిత్ర కూడా వినేందుకు టీడీపీ సభ్యులకు ఓపిక లేనట్లుగా ఉన్నదని మంత్రి బుగ్గన టీడీపీ సభ్యుల తీరును తప్పబట్టారు. ఈ సమయంలో శాంతించిన టీడీపీ సభ్యులు తమ నిరసనను ఆపారు.
3998