ఒక సంతాన సాఫల్య కేంద్రం వీర్య సేకరణ గదిలో , చుట్టూ సెక్సీ పోస్టర్ల మధ్య హీరో ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్పెర్మ్ రిలీజ్ చేయాలి. ఇది సీన్. మన తెలుగు హీరోలు ఈ సీన్ చెప్పగానే వణికిపోయి “ఫ్యాన్స్ ఒప్పుకోరు” అని రిజెక్ట్ చేస్తారు.
మరి హిందీ సినిమా గుడ్‌న్యూస్‌లో ఈ సీన్ చేసింది ఎవరో తెలుసా అక్షయ్‌కుమార్. దేశమంతా ఫాలోయింగ్ ఉన్న హీరో. 29 ఏళ్లుగా బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు. అత్యంత ఎక్కువ ఆదాయ పన్ను కట్టే నటుల్లో ఒకడు.
అక్షయ్ క్యారెక్టర్‌నే చూస్తాడు. హీరోయిజాన్ని చూడడు. టాయిలెట్ సినిమాలో ఆడవాళ్ల టాయిలెట్ కష్టాల్ని ఎత్తి చూపాడు. ప్యాడ్‌మ్యాన్‌లో మహిళల నెలవారీ కష్టాల్ని అర్థం చేసుకుని శానిటరీ ప్యాడ్స్‌ని తయారు చేయాలని తపించే భర్తగా నటించాడు.
ఇప్పుడు గుడ్‌న్యూస్. ఇప్పటికీ ఇది వందల కోట్ల కలెక్షన్ సాధించింది. కథ సింపుల్. అక్షయ్, కరీనాకపూర్ భార్యాభర్తలు. పిల్లలుండరు. సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదిస్తారు. వీర్య కణాలు బలహీనంగా ఉండడం వల్ల , ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా సంతానాన్ని పొందాలనుకుంటారు.
అదే సమయానికి వేరే దంపతులు కూడా ఇదే ట్రీట్‌మెంట్‌లో ఉంటారు. అయితే పొరపాటున ఒకరి వీర్యాన్ని ఇంకొకరికి ఎక్కిస్తారు. కరీనాకపూర్ భర్త అక్షయ్ వీర్యాన్ని కాకుండా , దిల్‌జిల్ దోసాంజ్ అనే వ్యక్తి వీర్యాన్ని అతని భార్య కైరా అద్వానీకి అక్షయ్ వీర్యం వెళుతుంది.
ఇద్దరు గర్భవతులు అయ్యాక విషయం తెలిసింది. ఏం చేయాలి? కైరా అద్వానీ దంపతులు ఇదంతా లిఖితమని అంగీకరించి బిడ్డని కనడానికి సిద్ధపడతారు.
అయితే అక్షయ్ ఒప్పుకోడు. ఇంకొకరి బిడ్డ, తన భార్య కడుపులో పెరగడం ఇష్టం ఉండదు. అబార్షన్ చేయించుకోమంటే కరీనా ఒప్పుకోదు. ఏం జరుగుతుందో తెరపై చూడాల్సిందే.
అసలు ఇలాంటి లైన్ తీసుకోవడం, అక్షయ్ , కరీనా లాంటి స్టార్స్ నటించడమే సాహసం. పైగా దీని నిర్మాతల్లో అక్షయ్ ఒకరు.
పిల్లల కోసం డాక్టర్లను సంప్రదించడం ఈ రోజుల్లో కామన్. కానీ పొరపాటు జరిగితే? ఆ తల్లిదండ్రుల బాధ, అది కూడా భారంగా కాకుండా హాస్యంగా చెప్పడమే ఈ సినిమా గొప్పతనం.