iDreamPost
android-app
ios-app

మంచివాడికి డీసెంట్ ఓపెనింగ్స్ – ఫస్ట్ డే కలెక్షన్స్

  • Published Jan 16, 2020 | 7:24 AM Updated Updated Jan 16, 2020 | 7:24 AM
మంచివాడికి డీసెంట్ ఓపెనింగ్స్ – ఫస్ట్ డే కలెక్షన్స్

సంక్రాంతి పోటీలో ఆఖరున బరిలో దిగిన నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా డీసెంట్ ఓపెనింగ్స్ తో ఖాతాను తెరిచింది. పండగ సెలవు కావడంతో చాలా చోట్ల మంచి కలెక్షన్స్ ని సాధించింది. వచ్చిన రిపోర్ట్స్ రివ్యూస్ డివైడ్ గా ఉన్నప్పటికీ నందమూరి హీరో బాగానే రాబట్టుకున్నాడు. ఇప్పుడీ పండగ సందడి తగ్గిపోయాక ఏ మేరకు స్టడీగా ఉంటాడనే దాన్ని బట్టి మంచివాడి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది.

వచ్చిన సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 2 కోట్ల దాకా షేర్ వచ్చింది. ఇవాళ కూడా చాలా చోట్ల రన్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ వీకెండ్ దాకా ఇదే తరహాలో కొనసాగితే సేఫ్ అవ్వొచ్చు కాని ఒకపక్క సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చాలా స్ట్రాంగ్ గా ఉన్న నేపధ్యంలో ఇదంత ఈజీ అయితే కాదు. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో మెహ్రీన్ హీరొయిన్ గా నటించిన ఎంత మంచివాడవురా ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామాగా రూపొందింది

AREA SHARE
నైజాం  0.50cr
సీడెడ్   0.38cr
ఉత్తరాంధ్ర  0.18cr
గుంటూరు   0.20cr
క్రిష్ణ   0.19cr
ఈస్ట్ గోదావరి  0.30cr
వెస్ట్ గోదావరి  0.18cr
నెల్లూరు   0.10cr
Total Ap/Tg  2.03cr