iDreamPost
android-app
ios-app

సీఎం జగన్‌ పెద్ద మనసు.. తెలంగాణ వారికీ పరిహారం

సీఎం జగన్‌ పెద్ద మనసు.. తెలంగాణ వారికీ పరిహారం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ప్రాంతాలకు అతీతంగా బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని నిరూపించారు. బుధవారం కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం వేదాద్రి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతులు తెలంగాణా వారైనప్పటికీ పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అన్ని విధాల వైద్య సహాయం అందించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం గ్రామానికి చెందిన వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబం ప్రతి ఏడాది వ్యవసాయ పనులు చేపట్టే ముందు జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా జమలాపురం, కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతిపురం గ్రామాలకు చెందిన తమ బంధువులను ఇంటికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, బంధువులు 25 మందితో ట్రాక్టర్‌పై దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో ఆలయం నుంచి మధ్యాహ్నం బయలుదేరి అరకిలోమీటర్‌ దూరం రాగానే హేమాద్రి సిమెంట్స్‌ కంపెనీకి చెందిన బొగ్గు లారీ వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్‌ నడిపిన వ్యక్తితోపాటు మరొకరులు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదం వివరాలు తెలుసుకున్న వెంటనే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తాజాగా ఈ రోజు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల్లో ఏపీతోపాటు తెలంగాణ వారు ఉండగా.. ప్రమాదం జరిగింది ఏపీలో కాబట్టి అందరికీ పరిహారం అందిచాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.