లాక్‌డౌన్ సమయంలో నిర్ణీత అనుమతి సమయం దాటాక పోలీస్‌లతో వాహనాలమీద దొంగా– పోలీస్ ఆడారా.. అయితే ఎందుకైనా మంచిది ఒక్క సారి మీ వాహనంమీద ఏదైనా ఈ చలాన్ నమోదైందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి పోలీస్‌లు సామ, బేద, దండోపాయాలను అనుసరిస్తున్న విషయం విదితమే. ఆ నాలుగింటిలో నాలుగో ఉపాయమే ఈ–చలాన్. వీధుల్లో పనీపాటు లేకుండా బళ్ళు, కార్ల మీద చక్కర్లు కొట్టేవాళ్ళకు సైలెంట్‌గా పోలీసువారు ఈ చలాన్‌లు విధిస్తున్నారు. నెంబరుతో సహా వాహనం ఫోటో తీస్తే చాలు మన పేరిట చలాన్ నమోదైనట్టే. అయితే కొందరికి ఇది సెల్‌ఫోన్ మెస్సేజ్‌ల ద్వారా వెనువెంటనే తెలిసిపోతుండగా, ఇంకొందరికి మాత్రం తెలియడం లేదు. దీంతో మనకేం కాదులే అనుకుని రోడ్లమీద తిరుగుతున్న వారి వాహనాలపై భారీగానే ఈ చలాన్‌లు నమోదైనట్లు సమాచారం.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య భారీగానే ఉంటుందని ఆర్టీవో వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదిలా ఉండగా లాక్‌డౌన్ సమయంలో ఒక్క హైదరాబాదులోనే 30వేల వరకు వాహనాలను పోలీస్‌లు సీజ్‌చేసి పక్కన పెట్టేసారు. వీటిని లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఈనెల 14 తరువాతనే యజమానులకు అందిస్తామని ఖరాకండీగా చెప్పేసారు. ఏపీలో మరీ ఆ స్థాయిలో వాహనాలను సీజ్ చేయకపోయినప్పటికీ ఈ చలాన్‌లు మాత్రం నమోదు చేస్తున్నట్లుగా సమాచారం.
లాక్‌డౌన్ పూర్తయ్యాక సదరు కాలక్షేపరాయుళ్ళు తప్పకుండా పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుదనేది ఆయా వర్గాలు చెబుతున్న మాట. ఎందుకైనా మంచిది ఇప్పటికే రోడ్డుమీద పనీపాటు లేకుండా తిరిగారేమో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ చలాన్ చెక్ చేసుకోండి… ‘మీకు.. అర్ధమవుతోందా!’.
6689