iDreamPost

VIDEO: తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతున్న నెదర్లాండ్స్‌ క్రికెటర్‌! వింటే షాక్‌ అవుతారు

  • Published Oct 07, 2023 | 11:01 AMUpdated Oct 07, 2023 | 11:01 AM
  • Published Oct 07, 2023 | 11:01 AMUpdated Oct 07, 2023 | 11:01 AM
VIDEO: తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతున్న నెదర్లాండ్స్‌ క్రికెటర్‌! వింటే షాక్‌ అవుతారు

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ప్రారంభమైన వరల్డ్‌ కప్‌లో శుక్రవారం పాకిస్థాన్‌ జట్టు నెదర్లాండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కామెంటేటర్స్‌తో జరిగిన చిట్‌ చాట్‌లో నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ తెలుగులో మాట్లాడి అదరగొట్టాడు. నెదర్లాండ్స్‌ టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న తేజా నిడమనూరు మ్యాచ్‌కి ముందు కామెంటేటర్లతో చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అయితే.. ఈ ఇంటర్వ్యూలో తేజా తెలుగులో మాట్లాడటం విశేషం. అతను పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనే అయినా.. పెరిగింది మాత్రం న్యూజిలాండ్‌లో. ఆ తర్వాత క్రికెట్‌పై ఆసక్తితో క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకుని.. నెదర్లాండ్స్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అనేక సందర్భాల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి.. నెదర్లాండ్స్‌ టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. అయితే తేజాకు ఇదే తొలి వరల్డ్‌ కప్‌. పైగా తన తొలి వరల్డ్‌ కప్‌ను పుట్టిన దేశంలోనే ఆడుతుండటంపై తేజా ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్‌ కప్‌లో తమకు ప్రతి మ్యాచ్‌ కీలకమని, ఏ టీమ్‌పై ఆడినా కూడా మంచి ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని తేజా అన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తేజా పెద్దగా రాణించలేదు. 9 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 49 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ 68, సౌద్‌ షకీల్‌ 68 పరుగులతో రాణించారు. నవాజ్‌ 39, షాదాబ్‌ 32 రన్స్‌తో పర్వాలేదనిపించారు. ఇక నెదర్లాండ్స్‌ బౌలర్లలో బస్‌ డీ లీడే 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక 287 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌.. 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటిన ఆల్‌రౌండర్‌ బస్‌ డీ లీడే బ్యాటింగ్‌లోను అదరగొట్టాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 67 పరుగులు చేసి రాణించాడు. అలాగే ఓపెనర్‌ విక్రమ్‌జిత్‌ సింగ్‌ సైతం 52 రన్స్‌తో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఓడిపోయినప్పటికీ.. మంచి పోరాటంతో ఆకట్టుకుంది. మరి ఈ మ్యాచ్‌ సందర్భంగా తేజా తెలుగులో ఇంటర్వ్యూ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: PAK vs NED: మరోసారి తప్పు చేసిన అంపైర్లు.. ఈసారి ఏం చేశారంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి