iDreamPost

ఆస్ట్రేలియాపై మహ్మద్ షమి సీరియస్.. వాళ్లు చేసింది తప్పంటూ..!

  • Author singhj Published - 03:35 PM, Fri - 24 November 23

వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాపై భారత పేసర్ మహ్మద్ షమి సీరియస్ అయ్యాడు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పంటూ ఫైర్ అయ్యాడు.

వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాపై భారత పేసర్ మహ్మద్ షమి సీరియస్ అయ్యాడు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పంటూ ఫైర్ అయ్యాడు.

  • Author singhj Published - 03:35 PM, Fri - 24 November 23
ఆస్ట్రేలియాపై మహ్మద్ షమి సీరియస్.. వాళ్లు చేసింది తప్పంటూ..!

వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమి నుంచి బయటపడేందుకు భారత క్రికెటర్లు చాలా ప్రయత్నిస్తున్నారు. మెగా టోర్నీలో ఆడిన జట్టులో నుంచి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్​లో బిజీ అయిపోయారు. మిగిలిన ప్లేయర్లు తమ ఇళ్లకు చేరుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ లాంటి కొందరు ఆటగాళ్లు ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై రియాక్ట్ అవుతూ వీడియోలు కూడా చేస్తున్నారు. అహ్మదాబాద్ పిచ్​ను ఆసీస్ పక్కాగా అర్థం చేసుకుందని.. ముందే ప్లాన్ ప్రకారం వచ్చి ఆడుతూ కప్పును కైవసం చేసుకుందని అన్నాడు. భారత స్పీడ్​స్టర్ మహ్మద్ షమి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచ కప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వరల్డ్ కప్ మొదటి కొన్ని మ్యాచులకు షమీని దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. టీమ్ కాంబినేషన్​లో భాగంగా ఈ పేసర్​ను ఫైనల్ ఎలెవన్​లో ఆడించలేదు. అయితే బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఇంజ్యురీ అవ్వడం, అతడు రికవర్ అవ్వకపోవడంతో షమీని రీప్లేస్ చేశారు. తనకు వచ్చిన ఛాన్స్​ను సూపర్బ్​గా వాడుకున్న ఈ స్టార పేసర్.. చెలరేగి బౌలింగ్ చేశాడు. టోర్నీ మొత్తంలో ఏకంగా 24 వికెట్లు తీశాడంటేనే షమి ఏ రేంజ్​లో బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి అతడు మాట్లాడుతూ.. మొదటి కొన్ని మ్యాచులకు రిజర్వ్ బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చినప్పుడు మానసికంగా చాలా బలంగా ఉండటం వల్ల ఇబ్బంది పడలేదన్నాడు. అయితే ఇలాంటి టైమ్​లో కొన్నిసార్లు ప్రెజర్​లోకి వెళ్లే ఛాన్స్ ఉందన్నాడు.

టీమ్​లో ప్లేస్ దక్కడం కంటే కూడా విజయాలు సాధిస్తున్నామా? లేదా? అనేదే ముఖ్యమన్నాడు షమి. బౌలింగ్ వేసే ముందు పిచ్​ను పరిశీలించే అలవాటు తనకు లేదన్నాడు. అలాగే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్​ కాంట్రవర్సీ మీదా అతడు స్పందించాడు. వరల్డ్ కప్​ ఫైనల్లో నెగ్గిన తర్వాత ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్​లో మిచెల్ మార్ష్​ ఉన్న ఒక ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో కప్పు మీద మార్ష్ తన రెండు కాళ్లు ఉంచడం వివాదాస్పదంగా మారింది. ఎంతో గౌరవంగా భావించే ప్రపంచ కప్ ట్రోఫీ మీద మార్ష్ కాళ్లు ఉంచడం సరికాదంటూ అతడిపై ఓ ఎఫ్​ఐఆర్ కూడా నమోదైంది. అలీగఢ్​కు చెందిన పండిట్ కేశవ అనే ఆర్టీఐ కార్యకర్త మార్ష్ మీద పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

మార్ష్​ చేసిన పని వల్ల 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని పండిట్ కేశవ్ తన ఫిర్యాదులో తెలిపారు. వరల్డ్ కప్ మీద కాళ్లు పెట్టిన అతడ్ని ఇండియాలో జరిగే మ్యాచుల్లో ఆడకుండా చూడాలని కోరాడు. కాగా, ట్రీఫీతో ఆసీస్​ ప్లేయర్ వ్యవహరించిన తీరుపై మహ్మద్ షమి తాజాగా స్పందించాడు. ‘ఆ ఫొటో చూసి నేను చాలా హర్ట్ అయ్యా. మెగా ట్రోఫీ కోసం ప్రపంచంలోని అన్ని టీమ్స్ పోటీపడతాయి. అలాంటి ట్రోఫీని ఎప్పుడూ మన తల కంటే ఎత్తులోనే ఉంచాలి. కానీ ఇలా దాని మీద కాళ్లు ఉంచడం నాకు ఏమాత్రం నచ్చలేదు’ అని షమి చెప్పాడు. భారత్ పేసర్ రియాక్షన్​ను సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. కరెక్ట్​గా చెప్పావ్ షమి.. వరల్డ్ కప్​ను గౌరవించాలి కానీ ఇలా అగౌరవపర్చకూడదని అంటున్నారు. మరి.. ఆసీస్ తీరును షమి తప్పుపట్టడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నిన్న రింకూని హగ్ చేసుకున్న ఇతను ఎవరు? అంతా ఇతని పుణ్యమే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి