iDreamPost

సీఎం జగన్ చొరవ.. దివ్యాంగుడికి అతి ఖరీదైన ఆధునిక కృతిమ కాలు

సీఎం జగన్  చొరవ.. దివ్యాంగుడికి అతి ఖరీదైన ఆధునిక కృతిమ కాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ రకాల సమస్యలతో తన వద్దకు వచ్చిన వారి సమస్యలను ఎంతో ఓపికా వింటారు. అలానే వారి సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించి.. వారి ముఖాల్లో చిరునవ్వులు చిందేలా చేస్తారు. అందుకే సీఎం జగన్ ను చాలా మంది మనసున్న మహారాజు అని కొనియాడుతుంటారు. తరచూ తన పర్యటనలో ఎంతో మందిని కలిసి.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతేకాక వారి సమస్యలకు తక్కువ టైమ్ లోని పరిష్కారం చూపిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ఆదేశంతో.. ఓ దివ్యాంగుడికి ఆధునిక కృతిమ కాలును అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఆపద అని తెలిస్తే చాలు.. మానవతా దృక్పథంతో స్పందిస్తారు సీఎం జగన్. కులాలు, మతాలు, పార్టీల భేదం చూడకుండా.. ఎందరినో ఆదుకున్నారు సీఎం జగన్‌. తాజాగా మరోసారి సీఎం జగన్ మంచి మనస్సుతో ఓ దివ్వాంగుడికి అతి ఖరీదైన కృతిమ కాలు అందింది.  అనంతపురానికి చెందిన సయ్యద్ ఖాజా రోడ్డు ప్రమాదం కాలు పోగొట్టుకున్నాడు. దీంతో అతడి కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది.  గత నెల8న సీఎం జగన్ కల్యాణ్ దుర్గం పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంలో హెలిప్యాడ్ వద్ద ఖాజా కుటుంబం సీఎం జగన్ ని కలిసింది. అంతే కాక కష్టాన్ని చెప్పుకుని బాధ పడ్డారు.

దీంతో వెంటనే స్పందించిన సీఎం జగన్.. బాధితుడికి సాయం చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమిని ఆదేశించారు. సీఎం ఆదేశాల  మేరకు కలెక్టర్ కూడా ఖాజాకు కృతిమ కాలు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే మామూలు కాలిపర్స్ కాకుండా ఆధునిక, నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండేలా కృతిమ కాలును సిద్దం చేయించాలనుకున్నారు. ఈ క్రమంలోనే నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండే కృతిమ కాలును సిద్ధం చేయించి.. సోమవారం బాధితుడికి అందించారు. సీఎం జగన్‌ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. మరి.. ఇలా పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి సాయం అందిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గొప్ప మనసు చాటుకున్న CM జగన్‌.. చిన్నారి వైద్యానికి ఏకంగా రూ.41.5 లక్షలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి