iDreamPost

దట్‌ ఈజ్‌ చేవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

దట్‌ ఈజ్‌ చేవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. చంద్రగిరి ఎమ్మెల్యేగా, తుడా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కాదు.. కష్టకాలంలో తన నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండే నేతగా చేవిరెడ్డి పేరుగాంచారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించే ఎమ్మెల్యేలు కొంత మంది. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేయించే వారు మరికొంత మంది ఎమ్మెల్యేలు. కానీ చేవిరెడ్డి వీరికి పూర్తిగా భిన్నమైన ప్రజా ప్రతనిధి. కష్టకాలంలో క్షణం ఆలస్యం చేయకుండా.. నేనున్నానంటూ ముందుకు వస్తారు చేవిరెడ్డి.

గత ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో.. నియోజకవర్గ ప్రజలకు, కరోనా వారియర్లకు, క్షేత్రస్థాయిలో పని చేసే ప్రభుత్వ సిబ్బందికి.. విటమిన్‌ ట్యాబ్‌లెట్లు, కరోనా రక్షణ కిట్లు, బియ్యం, కూరగాయలు. నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు చేవిరెడ్డి. ఇందు కోసం ఆయన కోట్లాది రూపాయలను వెచ్చించారు. చేవిరెడ్డి చోరవ ఇతర పలువురు ఎమ్మెల్యేలను సేవా కార్యక్రమాల బాట పట్టేలా చేసింది.

ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. మొదటి వేవ్‌ కన్నా.. ఈ సారి వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. ఆక్సిజన్‌ బెడ్లు అవసరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చేవిరెడ్డి మళ్లీ ముందుకు వచ్చారు. ఈ సారి నియోజకవర్గ ప్రజలకు వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రణాళికలు రచించారు. తన సొంత నిధులతో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 150 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రగిరిలోని ప్రభుత్వ ఆసత్పిలో 100, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో ఉన్న ప్రాథమిక వైద్యశాలలో 50 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు 10 వెంటిలేటర్లను కూడా సమకూర్చుతున్నట్లు చేవిరెడ్డి చెప్పారు. ఇందు కోసం 25 లక్షల రూపాయలు వెచ్చిస్తున్న చేవిరెడ్డి.. ఇతర ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read : ఆర్మీ అద్భుతం.. 3 గంటల్లోనే 100 ఆక్సిజన్ పడకల ఆస్పత్రి సిద్ధం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి