iDreamPost

మిర్చి దొంగలు.. రాత్రికి రాత్రే లక్షల పంట మాయం!

Mirchi Crop: ఈ మధ్యకాలంలో అక్రమ, అవినీతి, అసాంఘీక పనుల ద్వారా డబ్బులను సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇతరు కష్టపడి సంపాదించిన ధనం, ఇతర విలువైన వాటిని కొందరు నీచులు చోరీ చేస్తున్నారు. తాజాగా రైతుల పంటలను కూడా వదలడం లేదు.

Mirchi Crop: ఈ మధ్యకాలంలో అక్రమ, అవినీతి, అసాంఘీక పనుల ద్వారా డబ్బులను సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇతరు కష్టపడి సంపాదించిన ధనం, ఇతర విలువైన వాటిని కొందరు నీచులు చోరీ చేస్తున్నారు. తాజాగా రైతుల పంటలను కూడా వదలడం లేదు.

మిర్చి దొంగలు.. రాత్రికి రాత్రే లక్షల పంట మాయం!

నేటికాలంలో చాలా మంది అవినీతి సొమ్ముకు అలావాటు పడుతుంటారు. ముఖ్యంగా ఇతరు కష్టపడి సంపాదించిన దాని.. దొంగతనాలు చేస్తుంటారు. ఇళ్లల్లో విలువైన వస్తువులు, డబ్బులను దొచుకుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే.. అన్నపెట్టే రైతును కూడా బాధ గురి చేస్తున్నారు. పొలంలో ఉన్న పంటను రాత్రికి రాత్రే దొంగిలిచేస్తున్నారు. ఇటీవల కాలంలో మిరపకాయల దొంగతనాలు జరుగుతున్నాయి. లక్షల్లో విలువైన మిర్చిపంటను దొంగలు చోరి చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కలుగట్ల గ్రామానికి చెందిన రైతు శ్రీను మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొన్నాడు. అందులో మిరప పంటను సాగు చేస్తున్నాడు. ఆ పంట సాగుకు నాలుగు లక్షల పెట్టుబడి పెట్టాడు. రాత్రి బవళ్లు కష్టపడి పంటను కంటికి రెప్పల చూసుకునే వాడు. అనేక రకాల మందులు కొడుతు పంట దిగుబడి కోసం శ్రమిస్తున్నాడు. తరచూ నీటి కోరతతో ఇబ్బంది పడుతున్న ఆ రైతు.. ఏదో విధంగా పంటకు నీరు అందేలా చూస్తున్నారు. అలా కొన్ని నెలల పాటు పంటను పంటను పెంచడంతో.. కోత దశకు వచ్చింది.

ఇక మిర్చి పండటంతో అమ్ముకునేందుకు కోత కోసి..కలంలో ఆరబోశాడు. రెండు రోజులుగా కర్నూలు రోడ్డులోని గ్రాండ్ మహల్ వద్ద ఉన్న స్థలంలో ఆరబెడుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో మిర్చి అమ్మకాలకు మంచి రేటు పలుకుతుంది. దీంతో  దొంగల దృష్టి మిరపపై పడింది. పలు ప్రాంతాల్లో ఆరబెట్టిన మిర్చి పంటను దొంగిలిస్తున్నారు. తాజాగా శ్రీను ఆరబెట్టిన ఎండు మిర్చిపై కొంతమంది దొంగల కన్నేశారు. అర్ధరాత్రి సమయంలో దోపిడీకి తెగబడ్డ దొంగలు సుమారు 5 క్వింటాల మిర్చిన ఎత్తుకెళ్లరని ఆవేదనతో పోలీసులను రైతు ఆశ్రయించాడు.

చోరికి  గురైన మిరప విలువ సుమారు లక్ష ముప్పై వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో రైతు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. వీడియోల్లో రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్లు, కాసేపటికి పరుగెత్తిన దృశ్యాలు రికార్డయ్యాయి. అసలే వానాలు సరిగ్గా లేక అంతంత మాత్రమే పంటలు పండాయని, ఇలాంటి కరువు సమయంలో పండిన పంటను దొంగలు చోరీ చేయడంతో రైతు తీవ్ర వేదనకి గురయ్యాడు. మరి.. ఇలా  రైతుల కష్టాన్ని దొంగిలిస్తున్న నీచులకు ఏ లాంటి శిక్ష విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి