iDreamPost

Komatireddy Venkat Reddy: APలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుంది: మంత్రి కోమటి రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏపీ రాజకీయలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏపీ రాజకీయలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Komatireddy Venkat Reddy: APలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుంది: మంత్రి కోమటి రెడ్డి

శనివారం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్1వ తేదీన  ఏడో విడత పోలింగ్ తో  సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఇదే సమయంలో ఇక అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పై  పడింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై  అందరిలో ఆసక్తి నెలకొంది. అంతకు మించి దేశ ప్రజలందరి చూపు ఏపీ ఫలితాలపై ఉంది. ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ గెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. ఏపీ రాజకీయాల గురించి మాట్లారు. తెలంగాణ రాష్ట్ర అవతరణలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్  సర్కార్ తీసుకొచ్చిన రాష్ట్ర గీతంపై మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు అవుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్నీ స్కాంలే జరిగాయని ఆరోపించారు. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా గెలవదని మంత్రి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అత్యధిక లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో ఏపీ రాజకీయాల గురించి మీడియా మంత్రి వద్ద ప్రస్తావించారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి  వస్తుందని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవబోతున్నట్లు తనకు సమాచారం ఉందని ఆయన తెలిపారు. తనకు తెలిసిన వారు ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించగా జగన్ గెలుస్తారని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. తన బంధువులు రాయలసీమలో ఉన్నారని, అలానే చాలా మంది తెలిసిన ఆంధ్ర వ్యక్తులు వైఎస్సార్ సీపీనే గెలుస్తుందని చెప్పారని ఆయన తెలిపారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని తనకు తెలిసిందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి వంటి పలు గొప్ప పథకాలను  అందించారని, అందుకే మరోసారి ఏపీ ప్రజలు జగన్ నే గెలిపిస్తున్నారు. అలానే భవిష్యత్ లో ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే కృషి చేస్తామని ఆయన తెలిపారు. మొత్తంగా ఏపీ ఫలితాలపై తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి