iDreamPost

మైక్రోసాఫ్ట్‌ని డెవలప్ చేసిన భారత్ ఇంకా అలానే ఉండిపోయింది: బిల్ గేట్స్

Bill Gates On India: బిల్ గేట్స్ భారతదేశం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో భారత్ వెనుకబడిపోయింది అని కామెంట్స్ చేశారు. మైక్రోసాఫ్ట్ కి ఇంతటి ఘన విజయాన్ని అందించిన భారత్ ఆ విషయంలో ఇంకా ఇప్పటికీ అలానే ఉండిపోయిందని అన్నారు.

Bill Gates On India: బిల్ గేట్స్ భారతదేశం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంలో భారత్ వెనుకబడిపోయింది అని కామెంట్స్ చేశారు. మైక్రోసాఫ్ట్ కి ఇంతటి ఘన విజయాన్ని అందించిన భారత్ ఆ విషయంలో ఇంకా ఇప్పటికీ అలానే ఉండిపోయిందని అన్నారు.

మైక్రోసాఫ్ట్‌ని డెవలప్ చేసిన భారత్ ఇంకా అలానే ఉండిపోయింది: బిల్ గేట్స్

ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రతీ చోటా భారతీయులు ఉంటారు. ఏ పెద్ద కంపెనీ చూసుకున్నా అందులో భారతీయులే ఎక్కువగా కనిపిస్తారు. ఇక ప్రపంచంలో టాప్ కంపెనీలకు సీఈఓలుగా భారత్ కి చెందిన వాళ్ళు ఉండడం విశేషం. వీరంతా తమ కృషితో ఆ కంపెనీలను గ్లోబల్ గా నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. ఒక రకంగా ఈ కంపెనీల విజయంలో భారతీయులదే కీలక హస్తం. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, పెప్సికో ఇలా టాప్ కంపెనీల సక్సెస్ లో భారతీయుల వాటా ఉంది. అయితే ప్రపంచంలో టాప్ కంపెనీలకు ఇంత సక్సెస్ ఇచ్చిన భారతదేశం మాత్రం ఒక విషయంలో అలానే ఉండిపోయిందని బిల్ గేట్స్ అన్నారు. తన మైక్రోసాఫ్ట్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత్ ఒక విషయంలో మాత్రం ఇంకా అలానే ఉండిపోయిందని అసంతృప్తిని, విచారాన్ని వ్యక్తం చేశారు.   

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. సందర్భం వచ్చిన ప్రతిసారీ భారత్ తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి చెబుతుంటారు. తాజాగా మరోసారి భారత్ పట్ల తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారతీయుల కృషి ఉందని అన్నారు. నిఖిల్ కామత్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ సిరీస్ ని స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా బిల్ గేట్స్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో తనకు మంచి అనుబంధం ఉందని.. ఈ దేశం నుంచే నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను తమ సంస్థలో నియమించుకున్నామని అన్నారు. వాళ్ళని సియాటెల్ తీసుకెళ్లామని.. ఆ తర్వాత వాళ్ళు భారత్ కు వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కేంద్రాన్ని నెలకొల్పారని అన్నారు.

ప్రస్తుతం ఈ డెవలప్మెంట్ సెంటర్లు నాలుగే ప్రదేశాల్లో ఉన్నాయని.. వీటిలో 25 వేల మంది పని చేస్తున్నారని అన్నారు. మైక్రోసాఫ్ట్ విజయంలో భాగమైన అద్భుత వ్యక్తుల్లో చాలా మంది భారతదేశం నుంచి వచ్చిన వారే అని బిల్ గేట్స్ అన్నారు. ఇలా వచ్చిన వారిలో నేడు సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని.. డిజిటల్ కెరీర్ ప్రారంభంలో భారత్ తో ఉన్న అనుబంధం ఇప్పుడు కీలకంగా మారిందని బిల్ గేట్స్ అన్నారు. కానీ ఇప్పటికీ భారతదేశం పేదరికాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. ఇక ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని వస్తున్న వాదనలను బిల్ గేట్స్ ఖండించారు. కీలకమైన రంగాల్లో ఏఐ తోడుగా నిలవడమే కాకుండా.. ఉత్పాదకతను పెంచడంలో సహాయపడుతుందని అన్నారు.    

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి