iDreamPost

Mechanic Mavayya : హంగులు మిన్న విషయం సున్నా – Nostalgia

Mechanic Mavayya : హంగులు మిన్న విషయం సున్నా – Nostalgia

విషయం లేకుండా కేవలం హంగులతో గ్రాఫిక్స్ తో సినిమాలు ఆడతాయా అంటే చిన్నపిల్లాడిని అడిగినా నో అనే చెబుతాడు. బాహుబలిలో ఎంత గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా ఎమోషన్ లేకుండా ఆ గ్రాండియర్ ని ఊహించుకోగలమా. అసాధ్యం కదా. కట్టిపడేసే కథాకథనాలే దాన్ని ఇంకో స్థాయిలో నిలబెట్టాయి. వాటిని పట్టించుకోకుండా చేతిలో వనరులు ఉన్నాయి కదాని స్టార్ హీరోతో సినిమా తీస్తే బోల్తా కొట్టడం ఖాయం. అదెలాగో చూద్దాం. 1999 సంవత్సరం. ఈనాడు అధినేత రామోజీరావు గారు నిర్మించిన ఫిలిం సిటీ అప్పటికే దేశవ్యాప్తంగా ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. షూటింగులు కూడా క్షణం తీరిక లేకుండా జరగడం షురూ అయ్యింది.

దానికి ఇంకా ప్రచారం కల్పించే ఉద్దేశంతో ఉషాకిరణ్ బ్యానర్ మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారు రామోజీరావు. 80 దశకంలో ‘మయూరి’, ‘ప్రతిఘటన’ లాంటి బ్లాక్ బస్టర్స్ ఉండేవి కానీ 1992లో ‘వసుంధర’ ఫ్లాప్ అయ్యాక ప్రొడక్షన్ కి బ్రేక్ ఇచ్చారు. తిరిగి ఆరేళ్ళ తర్వాత 1998లో ఫిలిం సిటీలోనే పూర్తిగా చిత్రీకరణ చేసి ‘పాడుతా తీయగా’ నిర్మించారు. రవితేజ, వినీత్, హీరా లాంటి నోటెడ్ ఆరిస్టులు ఉన్నా అది ఫ్లాప్ అయ్యింది. తర్వాత ఏఎన్ఆర్ తో తీసిన ‘డాడీ డాడీ’ది కూడా సేమ్ రిజల్ట్. ఇలా కాదని చెప్పి అప్పటికే కథలు నవలల ద్వారా పేరు తెచ్చుకున్న అజయ్ శాంతి ఇచ్చిన కథలో మెకానిక్ మావయ్య సినిమాను ప్లాన్ చేసుకున్నారు రామోజీరావు. కన్నడలో స్టార్ డైరెక్టర్ గా పేరున రాజేంద్ర సింగ్ బాబుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.

ఆయన తెలుగులో అంతకు ముందు నాగార్జునతో తీసిన ‘ప్రేమయుద్ధం’ డిజాస్టర్. కానీ దీన్ని బాగా హ్యాండిల్ చేయగలరనే నమ్మకంతో ఒప్పించారు. రాజశేఖర్ – రంభ జంటగా పరేష్ రావల్-శ్రీహరి-కోట-బ్రహ్మానందం-ఏవీఎస్-మనోరమ తదితరులతో క్యాస్టింగ్ సెట్ చేసుకున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. స్వర్గీయ బాలసుబ్రమణ్యం ఓ కీలక పాత్ర పోషించారు. ఫాంటసీ ఫార్ములాతో ఈ స్టోరీని మొత్తం ఫిలిం సిటీలోనే షూట్ చేసి గ్రాఫిక్ వర్క్ కూడా అక్కడే చేయించారు. ఖర్చు కూడా బాగానే అయ్యింది. 1999 అక్టోబర్ 14న రిలీజైన మెకానిక్ మావయ్య ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. కనీస స్థాయిలో కథాకథనాలు లేకపోవడంతో దారుణ పరాజయం అందుకుంది. కేవలం ఫిలిం సిటీ హంగులు చూపించడానికి తప్ప ఇందులో ఏం లేదని ఆడియన్స్ తేల్చేశారు. రిజల్ట్ అట్టర్ ఫ్లాప్ అని వేరే చెప్పాలా

Also Read : Sainikudu , Varudu : స్టార్ పవర్ కాదు సరుకు ఉండాలి – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి