iDreamPost

వీడియో: పార్కింగ్ విషయంలో వివాదం.. కంట్రోలర్ పై దంపతుల దాడి!

ఆర్టీసీ సిబ్బందిపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై కొంత మంది ప్రయాణీకులు గొడవ పడి దాడి చేసిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా మరో సిబ్బందిపై

ఆర్టీసీ సిబ్బందిపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై కొంత మంది ప్రయాణీకులు గొడవ పడి దాడి చేసిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా మరో సిబ్బందిపై

వీడియో: పార్కింగ్ విషయంలో వివాదం.. కంట్రోలర్ పై దంపతుల దాడి!

ఈ మధ్య కాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. బస్సు డ్రైవర్ పై ఓ మహిళా అత్యుత్సాహం ప్రదర్శించి.. చేయి చేసుకోవడంతో జైలు పాలైన సంగతి విదితమే. ఇలాంటి ఘటనలు ఇటీవల నిత్యకృత్యం అవుతున్నాయి. డ్రైవర్‌తో పాటు కండక్టర్ పై కూడా దాడి చేసిన ఘటనలు చూశాం. ప్రయాణీకుల్లో ప్రస్టేషన్ ఎక్కువయ్యే తగాదాలకు దిగుతున్నారు. అలాగే కొన్ని సార్లు ఆర్టీసీ సిబ్బంది దురుసు ప్రవర్తన వల్ల కూడా దెబ్బలు పడుతున్నాయి. అలాగే కొంత మంది ఆకతాయిలు.. మద్యం సేవించిన వ్యక్తులు సైతం ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వాహనాలపై రాళ్లు రువ్వి..ప్రజా ఆస్తిని ధ్వంసం చేస్తుంటారు. తాజాగా మరో ఆర్టీసీ సిబ్బందిపై భార్యా భర్తలిద్దరు దాడి చేశారు.

పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తి ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేశారు భార్యా భర్తలు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బస్టాండ్ పార్కింగ్ ప్రాంతంలో కాకుండా బస్సులు తిరిగే ప్రాంతంలో భార్యా భర్తలు తమ వాహనాన్ని పార్కింగ్ చేసినట్లు తెలుస్తుంది.అంతలో అక్కడ ఉన్న కంట్రోలర్.. ఇక్కడ పార్కింగ్ చేయొద్దంటూ వారికి చెప్పాడు. ఈ విషయంలో కంట్రోలర్, భార్యా భర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఆ గొడవ కాస్త వివాదానికి దారి తీసి..భార్యాభర్తలిద్దరు కారు దిగి అక్కడే ఉన్న కంట్రోలర్ పై దాడి చేసినట్లు తెలుస్తుంది. పార్కింగ్ ప్లేసులో కాకుండా బస్సులు వెళ్లే ప్రాంతంలో కారు నిలిపినందుకు కంట్రోలర్.. ఇక్కడ నుండి బండి తీయాలంటూ చెప్పడంతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తుంది.

ఆవేశంతో ఊగిపోయిన భర్త.. కారు దిగి కంట్రోలర్ పై పిడిగుద్దులు కురిపించాడు. అక్కడే ఉన్న భార్య అతడిపై చేయి చేసుకుంది. అంతలో జనాలు గుమిగూడటంతో భర్తను విడిపించే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న స్థానికులు.. ఈ సమస్యను సద్దుమణిగేలా ప్రయత్నాలు చేశారు. దాడి ఆపేసిన అనంతంరం కూడా కంట్రోలర్ పై వాగ్వాదానికి దిగారు భార్యా భర్తలు. ఈదాడిలో కంట్రోలర్‌కు గాయాలయ్యాయి. దాడి పూర్తయ్యాక తమ వాహనంలో అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఆర్టీసీ కార్మికులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని ఆర్టీసీ కార్మికులు యాజమాన్యాన్ని హెచ్చరించారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి