iDreamPost

APలోని వారికి సర్కార్ తీపి కబురు! ఇకపై వారికి మంచి రోజులు!

ఏపీలోని జగన్ సర్కార్ వారికి తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్న వీరు.. తల ఎత్తుకు నిలబడేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలోని జగన్ సర్కార్ వారికి తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్న వీరు.. తల ఎత్తుకు నిలబడేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

APలోని వారికి సర్కార్ తీపి కబురు! ఇకపై వారికి మంచి రోజులు!

సమాజంలో వివక్షతకు గురౌతున్నారు ట్రాన్స్ జెండర్లు. శరీరంలో జరిగిన మార్పుల కారణంగా ఆడ, మగ కాకుండా మూడవ వ్యక్తిగా అవతరిస్తున్న వారే ఈ ట్రాన్స్ జెండర్లు. రహదారులు, వాహనాలు, షాపుల వద్ద చప్పట్టు కొట్టి డబ్బులు సంపాదించుకుని.. జీవనం సాగిస్తున్నారు. వీరి చేస్తున్న పని కారణంగా.. చీవాట్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.ఓటు బ్యాంకుగా మాత్రమే వీరిని చూస్తున్నాయి ప్రభుత్వాలు. అలాగే వీరి ఉపాధికి ఎలాంటి కృషి చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్ జెండర్లకు తీపి కబురు అందించింది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీన ఈ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉపాధి హమీ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా అమలు చేయనున్నారు. త్వరలో వీరికి జాబ్ కార్డులు జారీ చేయనుంది. ఈ హమీ పథకంలో చేరాలనుకున్న ఒక్కో వ్యక్తిని.. ఒక్కో కుటుంబంగా పేర్కొంటూ ఈ కార్డులు మంజూరు చేయనున్నారు అధికారులు. పంచాయతీ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది ట్రాన్స్ జెండర్లు ఉపాధి హామీ పనుల కోసం ముందుకు వస్తే శ్రమ శక్తి సంఘాలుగా గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.

దేశంలో తాము ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను ఇటీవల ట్రాన్స్ జెండర్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తాము ఎదుర్కొంటున్న వివక్షతో పాటు పని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. దీంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ.. ఉపాధి హమీ పథకం వీరికి కూడా అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ట్రాన్స్ జెండర్లకు జాబ్ కార్డులు ఇవ్వాలంటూ.. జిల్లాల కలెక్టర్లకు, డ్వామా డైరెక్టర్లకు ఈ నెల 15న ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్ జెండర్లకు గతంలో కూడా పలు చర్యలు చేపట్టింది వైఎస్సార్ ప్రభుత్వం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి