iDreamPost

YCP ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి.. ఇంటికి తిరిగి వెళ్తుండగా తీవ్ర విషాదం

  • Published Mar 04, 2024 | 8:56 AMUpdated Mar 04, 2024 | 9:33 AM

ఆంధ్రప్రదేశ్‌, బాపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌ ఒకరు ఇంటికి తిరిగి వెళ్తుండగా దారుణం జరిగింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌, బాపట్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే గన్‌మెన్‌ ఒకరు ఇంటికి తిరిగి వెళ్తుండగా దారుణం జరిగింది. ఆ వివరాలు..

  • Published Mar 04, 2024 | 8:56 AMUpdated Mar 04, 2024 | 9:33 AM
YCP ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి.. ఇంటికి తిరిగి వెళ్తుండగా తీవ్ర విషాదం

చిన్న నిర్లక్ష్యం.. జీవితాలను తలకిందులు చేస్తుంది. అప్పటి వరకు సంతోషంగా సాగిపోతున్న లైఫ్‌.. చేజారిపోతుంది. కుటుంబం రోడ్డున పడుతుంది. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారు చేసే పనులు మన జీవితాలను నాశనం చేస్తాయి. ఈ కోవకు చెందినవే రోడ్డు ప్రమాదాలు. చిన్నపాటి నిర్లక్ష్యం.. వల్ల నిండు ప్రాణం బలవ్వమటమే కాక.. కుటుంబం సర్వనాశనం అవుతుంది. అందుకే రోడ్డు మీద వాహనాలను నడిపేట్టప్పుడు.. మన గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తామో.. ఎదుటి వ్యక్తి గురించి అంతే ఆలోచించి జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలి. లేదంటే తీరని నష్టం వాటిల్లుతుంది.

ఇక తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం ఇలాంటి నష్టాన్నే మిగిల్చింది. ఎదిగిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుని.. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. బాధ్యతలన్నింటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. కొడుకును చూసుకుని ఆతల్లిదండ్రలు మురిసిపోయారు. అయితే వారి సంతోషాన్ని చూసి విధికి కన్ను కుట్టుంది. రోడ్డు ప్రమాదం రూపంలో చేతికి అంది వచ్చిన కొడుకును మృత్యువు కబళించింది. ఇక కుమారుడి మరణవార్త విన్న ఆ తల్లిదండ్రలును ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆ వివరాలు..

బాపట్ల జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ గోపిరెడ్డి (30) మృతి చెందాడు. బాపట్ల మండలం ఈతేరు-చుందూరుపల్లి రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాపట్లలోని ఉప్పెరపాలెంకు చెందిన గోపిరెడ్డి 2018లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం అతడు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం బైక్‌పై బాపట్ల వస్తుండగా లారీని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు గోపిరెడ్డి. దీంతో వెనుక నుంచి లారీ, ఆపై ముందు నుంచి బస్సు వచ్చి అతడి బైక్‌ను ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో గోపిరెడ్డి తలకు తీవ్రగాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

గోపిరెడ్డి మృతితో అతడి కుటుంబాన్ని తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గన్‌మెన్ గోపిరెడ్డి మరణంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. సంతాపాన్ని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి