iDreamPost

Maataraani Mounamidi మాటరాని మౌనమిది రిపోర్ట్

Maataraani Mounamidi  మాటరాని మౌనమిది రిపోర్ట్

నిన్న బాక్సాఫీస్ మీద ఏకంగా ఏడు సినిమాలు దాడి చేశాయి దేనికీ ఓపెనింగ్స్ లేకపోవడం ట్రేడ్ ని నిరాశపరిచింది. ఒక రోజు ముందు వచ్చిన ధనుష్ తిరుకే అంతో ఇంతో డీసెంట్ టాక్ నడుస్తోంది. వాంటెడ్ పండుగాడ్ థియేటర్ల నుంచి జనం పూర్తి కాకుండానే పరుగులు పెడుతుండగా తీస్ మార్ ఖాన్ కు వెళ్లినవాళ్లకు నిరాశ తప్పడం లేదు. అటు హిందీ మూవీ దొబారా కూడా దొబ్బేసిందనే నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. వీటి మధ్యలో వచ్చిన మరో చిన్న చిత్రం మాట రాని మౌనమిది. సోషల్ మీడియాలో దీనికి బాగానే ప్రచారం దక్కింది. ఒక రోజు ముందే ప్రసాద్ ఐమ్యాక్స్ లో ప్రివ్యూ కూడా వేశారు. ఇందులో ఏమైనా సర్ప్రైజులు ఉన్నాయేమో రిపోర్ట్ లో చూద్దాం

ఇది ఇద్దరు బావ బావమరుదుల కథ. రామ్(మహేష్ దత్త)చెల్లిని ఈశ్వర్(సంజయ్ రాయ్) పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఓ సందర్భంలో ఈశ్వర్ ఇంట్లో ఒక ఉంగరం రామ్ కు దొరుకుతుంది. అది తొడుగుకున్నాక తనకేదో శక్తులు వచ్చినట్టు రామ్ కు అర్థమవుతుంది. అక్కడి నుంచి వీళ్ళ జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సీత(సోని శ్రీవాస్తవ) ప్రవర్తనలోని మార్పులకూ అదే కారణమవుతుంది. ఇంతకీ ఆ ఉంగరం కథా కమామీషు ఏంటి, ఎందుకు అది రామ్ కే చేరింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. టైటిల్ చూసి ఇదేదో ఎమోషనల్ లవ్ స్టోరీ అనుకుంటే పొరపాటు పడినట్టే.

కాన్సెప్ట్ పరంగా బాగానే ఉన్నప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో దర్శకుడు సుకు పూర్వజ్ సరైన హోమ్ వర్క్ చేయలేదనిపిస్తుంది. స్క్రీన్ ప్లే లోపాల వల్ల చాలా సన్నివేశాలు హడావిడిగా ముగుస్తాయి. కనెక్టివిటీని సరిగా సెట్ చేసుకోలేకపోయారు. చాలా చోట్ల సాగతీత దెబ్బ కొట్టింది. కనీసం పాటల మీదైనా శ్రద్ధ వహించి ఉంటే మ్యూజిక్ లవర్స్ కొంత ఊరట చెందేవాళ్ళు. కానీ ఆ అవకాశాన్ని వాడుకోలేదు. నెరేషన్ స్లోగా ఉండటం మాటరాని మౌనమిదిని ఓపికకు పరీక్ష పెట్టే ప్రహసనంగా మార్చేసింది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బాగానే ఉన్నప్పటికీ వాళ్ళ కష్టానికి తగినంత అవుట్ ఫుట్ కంటెంట్ రూపంలో లేదు. సో థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే విషయమైతే ఇందులో లేదనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి