iDreamPost

లీటర్‌ ఎలుక పాల ధర రూ. 18 లక్షలు!

లీటర్‌ ఎలుక పాల ధర రూ. 18 లక్షలు!

సాధారణంగా గాడిద పాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. లీటరు గాడిద పాల ధర వేలల్లో ఉంటోంది. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో గాడిదను వీధుల్లో తిప్పుతూ అప్పటికప్పుడు వాటి పాలను పిండి అమ్ముతూ ఉన్నారు. అయితే, ఖరీదైన జంతువుల పాలల్లో మనకు తెలిసినంత వరకు గాడిదదే పై చెయ్యి కానీ, ఎలుక.. గాడిద రికార్డును బద్ధలు కొట్టింది. అత్యంత ఖరీదైన పాలుగా ఎలుక పాలు చరిత్ర సృష్టించాయి. లీటర్‌ ఎలుక పాలు ఏకంగా 18 లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి

లీటరు పాలు 18 లక్షల రూపాయలా అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే ఇక్కడ డిమాండ్‌ అండ్‌ సప్లై థియరీ వర్తిస్తుంది. సాధారణంగా ఎలుక.. గేదెలు, గాడిదల్లా పెద్ద మొత్తంలో పాలు ఇవ్వదు. 30 నిమిషాల పాటు కష్టపడితే కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పాలు వస్తాయి. ఒక లీటర్‌ ఎలుక పాలను సంపాదించడానికి ఏకంగా 40 వేల ఎలుకల్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది. లీటర్‌ ఎలుక పాల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 23 వేల యూరోలుగా ఉంది. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో 18 లక్షల రూపాయలు అన్నమాట.

ఈ ఎలుక పాలను పరిశోధన కోసం వాడతారు. మలేరియా వ్యాధిని తగ్గించే మందుల తయారీలోనూ ఈ ఎలుక పాలను వాడతారట. అందుకే ఎలుక పాలకు ఇంత భారీ డిమాండ్‌ ఉంది. కానీ, దానికి తగ్గ సప్లై లేదు. 40 వేల ఎలుకల్ని పట్టి.. దాని పాలను పిండుకుని సొమ్ము చేసుకునే లోపు పుణ్య కాలం కాస్తా గడిచిపోతుంది. మరి, 18 లక్షల రూపాయల ధర పలుకుతున్న ఎలుక పాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : TDP పగ్గాలు బాలయ్యకి? లోకేశ్‌ని సైడ్ చేసినట్టేనా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి