iDreamPost

మద్యం ప్రియులకు భారీ షాక్.. తెలంగాణలో పెరగనున్న ధరలు?

Liquor Rates In Telangana May Hike: తెలంగాణ మద్యం ప్రియులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి.. ధరలు ఎంత పెరుగుతున్నాయి? ఎప్పుడు పెరుగుతున్నాయో చూడండి.

Liquor Rates In Telangana May Hike: తెలంగాణ మద్యం ప్రియులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి.. ధరలు ఎంత పెరుగుతున్నాయి? ఎప్పుడు పెరుగుతున్నాయో చూడండి.

మద్యం ప్రియులకు భారీ షాక్.. తెలంగాణలో పెరగనున్న ధరలు?

తెలంగాణలో మద్యంప్రియులకు భారీ షాక్ తగలనుంది. అదేంటంటే.. తెలంగాణ రాష్ట్రంలో మద్య ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికప్పుడు ధరలు పెంచాలా? అలా పెంచితే వచ్చే లాభాలు ఏంటి? నష్టాలు ఏమైనా ఉంటాయా? అనే కోణంలో అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం సాధారణంగా జరిగేదే. అలాగే ఈసారి కూడా మద్యం ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కారు మద్య ధరల పెంపుపై సమాలోచనలు చెస్తున్నట్లు సమాచారం.

ఎంత పెంపు?:

ఈ లిక్కర్ ధరలు నిజానికి మార్చి నెలలోనే పెరగాల్సి ఉంది. గత ప్రభుత్వం మార్చి నెలలో ధరలు పెంచింది. ఈ ఏడాది కూడా మార్చి నెలలోనే పెరగాల్సి ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. ఇంక ధరల పెంపు విషయానికి వస్తే.. సాధారణంగా మద్యం ధరలు 25 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. అన్ని బ్రాండ్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ధరల పెంపు వలన ఏటా ప్రభుత్వానికి అదనంగా రూ.3.5 వేల కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార వర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంత వరకు ధరలను పెంచేందుకు ఆస్కారం ఉందో కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

సంక్షేమం కోసం:

ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. ఈ ధరలు పెంపుపై వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వినియోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏటా ప్రభుత్వానికి రూ.37 వేల కోట్లు వరకు సమకూరుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సంక్షేమ పథకాలు అమలుకు ఈ పెరిగిన ఆదాయం కచ్చితంగా అక్కరకు వస్తుంది. కాబట్టి దాదాపుగా ధరలు పెంచే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కూడా ఈ మద్యం ధరల పెంపు అంశంపై చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి