iDreamPost

నెలాఖరులోగా ఈ పని చేయకుంటే.. గ్యాస్ సబ్సిడీ అందదు

దేశంలో చాలా మంది ఇప్పుడు వంటకాలకు గ్యాస్ వినియోగిస్తున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గ్యాస్ వాడకం.. ఇప్పుడు గ్రామీణ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఉజ్వల స్కీమ్ ద్వారా ఎంతోమంది ఎల్‌పీజీ గ్యాస్ ని నియోగిస్తున్నారు.

దేశంలో చాలా మంది ఇప్పుడు వంటకాలకు గ్యాస్ వినియోగిస్తున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గ్యాస్ వాడకం.. ఇప్పుడు గ్రామీణ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఉజ్వల స్కీమ్ ద్వారా ఎంతోమంది ఎల్‌పీజీ గ్యాస్ ని నియోగిస్తున్నారు.

నెలాఖరులోగా ఈ పని చేయకుంటే.. గ్యాస్ సబ్సిడీ అందదు

ఈ మద్య కాలంలో ప్రతి పథకానికి బయోమెట్రిక్ తప్పని సరి అయ్యింది. ప్రభుత్వం అమలు పరుస్తున్న ఎన్నో పథకాలు పక్కదోవ పట్టకుండా.. సరైన లబ్ధిదారులకు చేరే విధంగా ప్రభుత్వం బయోమెట్రిక్ సిస్టం ఏర్పాటు చేశారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.. వేలిముద్ర, ఫేస్ రీడింగ్. చాలా వరకు ఆధార్ తో అనుసంధానం అయి ఉంటుంది. బయో మెట్రిక్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపయోగిస్తుంటారు. దేశంలో గ్రామీణ, పట్టణాల్లో గ్యాస్ వాడకం పెరిగిపోయింది. ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ పొందిన వారికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తాయని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రెండు వందల రూపాల వరకు సబ్సిడీ వస్తుంది. మిగతా వారికి మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు గ్రామాల్లో వంట వండుకోవాలంటే కట్టెల పొయ్యి వాడేవారు. దేశంలో ఎప్పుడైతే ఉజ్వల స్కీమ్ మొదలు పెట్టారో.. గ్రామాలు, పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఉజ్వల స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ పొందిన వారికి రెండ వందల రూపాలు సబ్సిడీ వస్తుంది. మిగతా వారికి ఆ అవకాశం లేదు. గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకునే సమయం దగ్గర పడుతుంది. ఈ నెలాఖరు లోగా గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ అబ్ డేట్ చేసుకోవాలి. ఇటీవల బయోమెట్రిక్ అప్ డేట్ చేసేందుకు గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లాలని వినిపించినా.. ప్రస్తుతం గ్యాస్ డెలివరీ చేసే వారే కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ అప్ డేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం గ్యాస్ డెలివరీ చేసే వారి వద్ద ఓ ప్రత్యేక యాప్ ఉంటుంది.. దాని ద్వారా వేలి ముద్ద లేదా ఫేస్ స్కాన్ చేస్తారు. ఒకవేళ గ్యాస్ డెలివరీ చేసేవారు రాకుంటే ఏజెన్సీ షాపులకు వెళ్లైనా అప్ డేట్ చేయించుకోవాలని అంటున్నారు. ఒకవేళ అప్ డేట్ చేయని ఎడల సబ్సీడీ లభించదు అంటున్నారు.

gas subsidy

ఇప్పటి వరకు కొంతమంది వినియోగదారులకు బయోమెట్రిక్ అప్ డేట్ గురించి సమాచారం లేదని అంటున్నారు. ఇక గ్యాస్ నిబంధనల విషయంలో గ్యాస్ డీలర్ల కూడా గందరగోళంగా ఉంది. డిసెంబర్ 31 లోగా గ్యాస్ సబ్సీడీ దారులు తప్పకుండా వేలి ముద్ర కాని, ఫేస్ స్కాన్ చేయడం కానీ తప్పకుండా అప్ డేట్ చేయాలని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొత్త ఏడాది 1వ తేదీ నుంచి కొన్ని నిబంధనల్లో మార్పులు వస్తుంటాయి. వాటిని ముందుగానే గమనించి పనులు చేసుకుంటే ఇబ్బందులు ఉండవని లేదంటే.. ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గ్యాస్ వినియోగదారులు బయోమెట్రిక్ అప్ డేట్ విషయం సాధ్యమైనంత వరకు ఎక్కవ ప్రచారం జరగాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి