iDreamPost

లక్షద్వీప్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

మాల్దీవ్స్‌ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో లక్షద్వీప్‌ గురించిన చర్చ బాగా జరుగుతోంది. ఇంతకూ లక్షద్వీప్‌ల చరిత్ర ఏంటి? ఆ ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చింది?..

మాల్దీవ్స్‌ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో లక్షద్వీప్‌ గురించిన చర్చ బాగా జరుగుతోంది. ఇంతకూ లక్షద్వీప్‌ల చరిత్ర ఏంటి? ఆ ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చింది?..

లక్షద్వీప్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

గత రెండు మూడు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా లక్షద్వీప్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. దీనిపై మాల్దీవ్స్‌ మంత్రులు దారుణంగా స్పందించారు. తప్పుతప్పుగా మాట్లాడారు. లక్షద్వీప్‌ తమ మాల్దీవ్స్‌కు ఎప్పటికీ పోటీ రాలేవంటూ మాట్లాడారు. ఇక, మాల్దీవ్స్‌ ప్రభుత్వం ఆ మంత్రులపై చర్యలు తీసుకుంది. దీంతో సమస్య కొంత సద్దుమణిగినా.. అందరి దృష్టి మాత్రం లక్షద్వీప్‌లపైనే ఉండిపోయింది. ప్రధాని మోదీ ప్రత్యేకంగా పర్యటించేంత లక్షద్వీప్‌లో ఏముంది? లక్షద్వీప్‌ చరిత్ర ఏంటి? అందులో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.

లక్షద్వీప్‌ల చరిత్ర ..

1500 బీసీ నుంచే లక్షద్వీప్‌లో మానవుల మనుగడ మొదలైనట్లు తెలుస్తోంది. బుద్ధుడి జాతక కథల్లోనూ లక్షద్వీప్‌ ప్రస్తావన ఉంది. ఇక్కడికి ఎక్కువగా ఇతర దేశాలకు చెందిన నావికులు వస్తూ పోతూ ఉండేవారు. లక్షద్వీప్‌ ప్రసక్తి మొట్ట మొదటి సారి మొదటి శతాబ్ధంలో వచ్చింది. గ్రీక్‌ నావికుడు తాబేలు మూపురంలా ఉందని ఆ ద్వీపం గురించి అన్నాడు. 1100ల కంటే ముందు కులశేఖర వంశం ఏలుబడిలో లక్షద్వీప్‌ ఉండింది. ఆ వంశం నశించిన తర్వాత కొలత్రిస్‌ అనే వంశం ఏలుబడిలోకి లక్షద్వీప్‌ వచ్చింది. లక్షద్వీప్ గురించిన ప్రస్తావన తమిళ సాహిత్యంలో మొట్టమొదటగా వచ్చినట్లు చెబుతారు. ఒకప్పుడు పల్లవుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.

చెర, సంగమ్‌ పాటిరు పట్టుల ఏలుబడిలోనూ లక్షద్వీప్‌ ఉండింది. 661 సంవత్సరంలో ఉబైదుల్లా అనే వ్యక్తి ద్వారా ఇస్లామిక్‌ లక్షద్వీప్‌లోకి అడుగుపెట్టింది. 16వ శతాబ్ధంలో లక్షద్వీప్‌ కన్నోర్‌ రాజ్యంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత 1787లో అమిన్‌ దీవిలోని ద్వీపాలు అన్నీ టిప్పు సుల్తాన్‌ ఏలుబడిలోకి వెళ్లాయి. 1956లో రాష్ట్రాల విభజించటంతో మలబార్‌ జిల్లానుంచి లక్షద్వీప్‌ వేరుబడ్డాయి. కేంద్ర ప్రాంత పాలితంగా మారిపోయాయి. 1973 వరకు లక్షద్వీప్‌ను లక్కదీవి, మినికాయ్‌, అమిన్‌దివి అని పిలిచేశారు. 1973, నవంబర్‌ 1వ తేదీన లక్షద్వీప్‌ అ‍న్న పేరు పెట్టారు.

అన్నీ చిన్న చిన్న ద్వీపాలు!

లక్షద్వీప్‌లో అన్ని ద్వీపాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ప్రతీ ద్వీపం 1.6 కిలోమీటర్ల పొడవుకు మించి ఉండదు. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది మలబార్‌ తీరానికి చెందిన వారే. ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. లక్షద్వీప్‌లో ఎక్కువ మంది మలయాళం మాట్లాడతారు. లక్షద్వీప్‌లోని మినకాయ్‌లో మాత్రం సింహళం మాట్లాడతారు. అంతేకాదు! హిందీ మాట్లాడేవారు కూడా ఇక్కడ ఉన్నారు. జనం ఎక్కువగా కొబ్బరి సాగుతో జీవిస్తున్నారు. కొబ్బరిసాగుతో పాటు చేపల వేట కూడా ప్రధానంగా ఉంది. లక్షద్వీప్‌లో కొబ్బరి చెట్లతో పాటు చాలా రకాల వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడి నీటిలో షార్కులు, బోనిటాస్‌, టూనాలు, స్నాపర్స్‌, ఎగిరే చేపలు, ఆక్టోపస్‌లతో పాటు చాలా రకాల జీవులు నివసిస్తున్నాయి.

పేరెలా వచ్చిందంటే..

 లెక్కల్లో లేని అనేక ద్వీపాలు ఈ సముద్రంలో ఉన్నాయి. అందుకే లక్షద్వీప్ అనే పేరు వచ్చింది. లక్షద్వీప్‌ పేరుతో ఇక్కడ ఓ జిల్లా కేంద్ర కూడా ఉంది. ప్రస్తుతం దొరికే అంకెల ప్రకారం 10 దీవుల్లో మాత్రమే జనాభా ఉన్నారు. మిగిలిన 17 దీవులలో జనాభా శూన్యం. ప్రస్తుతం ఇక్కడ జనాభా మొత్తం కలిసి 70వేలు లోపే ఉంది. అంతేకాదు! ఈ దీవులు మాల్దీవులలోని చాగోస్ దీవులను పోలి ఉంటాయి. మరి, లక్ష్యద్వీప్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి