iDreamPost

Kumari Aunty: అనుకున్నదే అయింది.. బిగ్ బాస్ లోకి కుమారీ ఆంటీ?

కుమారీ ఆంటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా కారణంగా ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యింది. తాజాగా మరో వార్తలో ఆంటీ వార్తల్లో నిలిచింది.

కుమారీ ఆంటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా కారణంగా ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యింది. తాజాగా మరో వార్తలో ఆంటీ వార్తల్లో నిలిచింది.

Kumari Aunty: అనుకున్నదే అయింది.. బిగ్ బాస్ లోకి కుమారీ ఆంటీ?

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. అందుకే  దీని ద్వారా చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా కొందరు అయితే ఒక్క వీడియోతోనే ఓవర్ నైట్ స్టార్లు గా మారిపోతున్నారు. అలానే మరికొందరు అనుకోకుండా వారు చెప్పే డైలాగ్స్ తో ఫుల్ వైరల్ గా మారి..ఫేమస్ అవుతుంటారు. ఆ తరువాత మంచి అవకాశాలు సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన వారిలో  కుమారీ ఆంటీ ఒకరు. ఆమె సంబంధించి  ఇప్పటికే అనేక వార్తలు రాగా తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. కుమారీ ఆంటీ బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మరి.. ఆ  పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సోషల్ మీడియ ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. తమ వీడియోలను నెట్టింట్లో పోస్టు  చేస్తూ..ఫేమస్ అవుతుంటారు. మరికొందరు ఫేమస్ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అలానే కొన్ని సార్లు మీడియానే కొందరిని ఫేమస్ చేస్తుంది. అలాంటి వారిలో కుమారీ ఆంటీ ఒకరు. ఆమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కుమారి ఆంటీ అనగానే ఠక్కున గుర్తుపడతారు. రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తూ.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన డైలాగ్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ అయ్యింది.

Kumari aunty into Biggboss

సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోని ఇనార్భిట్ మాల్ సమీపంలో రోడ్ సైడ్ మీల్స్ వ్యాపారం చేస్తుంది. సోషల్ మీడియాలో కుమారీ ఆంటీ క్రేజ్ చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందల మంది క్యూ కట్టడం, పోలీసులు ఎంట్రీతో ఒకరోజు ఆపేశారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా రేవంత్ రెడ్డి కల్పించుకొని ఆమె ఫుడ్ బిజినెస్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని ఆదేశాలు జారీ చేశారు. ఇలా వచ్చిన ఫేమ్ తో కుమారీ ఆంటీకి కొన్ని టీవీ ఛానల్స్ తమ సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కూడా ఎంట్రీ  ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే.. ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లో ఉన్నప్పుడూ ఆమెపై ట్రోల్స్ కూడా నడిచాయి. ఏదో ఒకరోజు కుమారీ ఆంటీ కూడా బిగ్ బాస్ లో పంపేచే వరకు ఆగేలా లేరని ట్రోల్స్ నడిచాయి. అప్పుడు చేసింది ట్రోల్సే అయినా.. అవి ఇప్పుడు నిజమయ్యాయి. ఆమెను ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరి కొన్ని నెలల్లో  సీజన్ 8 మొదలైపోతున్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ టీమ్ వెతుకులాట ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా ఆమె తుది నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. గతంలో కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నవారిని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ సీజన్ మొదలయ్యాక వాళ్ళు హౌస్ లో కనిపించేవారు కాదు. మరి కుమారి ఆంటీ విషయం ఏం జరుగుతుందో తెలియాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి