iDreamPost

KL Rahul: దేశం కోసం KL రాహుల్ గొప్ప నిర్ణయం! ఇది అందరికీ ఆదర్శం!

  • Published Dec 13, 2023 | 2:09 PMUpdated Dec 13, 2023 | 5:19 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ 2024లో తన టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఓ కండీషన్‌ పెట్టాడు రాహుల్‌. అయితే ఆ నిర్ణయం టీమిండియాకు ఉపయోగపడేది కావడం విశేషం.

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ 2024లో తన టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఓ కండీషన్‌ పెట్టాడు రాహుల్‌. అయితే ఆ నిర్ణయం టీమిండియాకు ఉపయోగపడేది కావడం విశేషం.

  • Published Dec 13, 2023 | 2:09 PMUpdated Dec 13, 2023 | 5:19 PM
KL Rahul: దేశం కోసం KL రాహుల్ గొప్ప నిర్ణయం! ఇది అందరికీ ఆదర్శం!

ఈ రోజుల్లో చాలా మంది ప్లేయర్స్‌కి క్రికెట్ అంటే కోట్ల వర్షం కురిపించే ఓ అక్షయ పాత్ర. కానీ.., ఈ ఆట కోసం సామాన్య ప్రేక్షకులు ప్రాణాలు అర్పిస్తుంటారు. మ్యాచ్ లు చూడటానికి అన్నీ పనులు పక్కన పెడుతుంటారు. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఓడిపోతే గుండె పగిలిపోయినంతగా ఫీల్ అవుతుంటారు. ఇంతలా ఆడియన్స్ క్రికెట్ ని ఆరాధిస్తూ ఉంటే.. ఆటగాళ్లు మాత్రం ఆటని అడ్డం పెట్టుకుని మనీ వేటలో పడిపోయారన్న అపవాదు ఉండనే ఉంది. కానీ.., అందరి ఆటగాళ్ల విషయంలో ఇదే వర్తించదు. దేశానికి ఆడటం గౌరవంగా ఫీల్ అయ్యే ఛాంపియన్స్ చాలా మందే ఉన్నారు. టీమిండియాలో అలాంటి వారికి కొదవ లేదు. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం తాజాగా దేశం కోసం ఓ గొప్ప నిర్ణయం తీసుకుని తన విధేయతని చాటుకున్నాడు. కోట్లు సంపాదించే అవకాశం ఉన్న దగ్గర.. దేశ అవసరాలను గుర్తించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ రాహుల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2024 ఐపీఎల్ కోసం అన్నీ ఫ్రాంచైజీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆటగాళ్లతో టచ్ లోకి వెళ్లి.. ఎలా సన్నద్ధం అవ్వాలో సూచిస్తున్నాయి. కెప్టెన్స్ అవసరాలను గుర్తించి వేలంలో కొత్త ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించబోతున్నాయి. ఇలాంటి సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి కెప్టెన్ రాహుల్ ఓ షాక్ ఇచ్చాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ లో రాహుల్ ఓపెనర్ గా అదరగొడుతూ వస్తున్నాడు. ఎప్పుడూ ఆరెంజ్ క్యాప్ కాంపిటేషన్ లిస్ట్ లో రాహుల్ పేరు ఉండటానికి కారణం కూడా ఇదే. పవర్ ప్లే కి తగ్గట్టు స్ట్రోక్స్ ఆడే.. రాహుల్ లాంటి ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ అయినా ఓపెనర్ గానే ఆడించాలని కోరుకుంటుంది. కానీ.., కేఎల్ రాహుల్ మాత్రం ఈసారి ఐపీఎల్ లో తాను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తానని, అందుకు తగ్గట్టే వ్యూహాలు సి​ద్ధం చేసుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యాన్ని కోరినట్టు తెలుస్తోంది. రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరికీ షాక్ కలిగిస్తోంది.

kl rahul take desicion for india

ఇంటర్నేషనల్ క్రికెట్ లోని అన్నీ ఫార్మాట్స్ లో ఓపెనర్ గానే కెరీర్ స్టార్ట్ చేసిన రాహుల్.. అనూహ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా మారిపోయాడు. వన్డే వరల్డ్ కప్ లో ఈ మార్పు మంచి ఫలితాన్ని ఇచ్చింది కూడా. ఇక ఐపీఎల్ తరువాత టీ20 వరల్డ్ కప్ ఉండనే ఉంది. ఒకవేళ బీసీసీఐ గనుక సీనియర్స్ కి ఛాన్స్ ఇస్తే.. లైన్ లోకి రోహిత్, కోహ్లీ వచ్చి చేరుతారు. దీంతో రాహుల్ కి ఓపెనర్ గా ఛాన్స్ ఉండదు. లేదు అంతా జూనియర్స్ తో పోదామని నిర్ణయించుకున్నా.. జైస్వాల్, ఋతురాజ్, గిల్ ఉండనే ఉన్నారు. ఇలా.. ఏ రకంగా చూసుకున్నా టీ20 వరల్డ్ కప్ లో కూడా రాహుల్ మిడిల్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ కి రావాల్సి ఉంటుంది. ఈ కారణంగానే రాహుల్ ఐపీఎల్ లో కూడా మిడిల్ ఆర్డర్ లోనే ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ద్వారా.. కావాల్సినంత ప్రాక్టీస్ పొందే అవకాశం ఉండటంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇలా ఓ స్టార్ ఆటగాడు తన బ్యాటింగ్ పొజిషన్ వెనక్కి నెట్టుకోవడం అంటే సాహసం అనే చెప్పుకోవాలి. కానీ.., జాతీయజట్టు అవసరాల కోసం రాహుల్ ఇంత గొప్పగా ఆలోచించడం అద్భుతమైన విషయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి