iDreamPost

RC15 : మెగా మూవీలో శాండల్ వుడ్ హీరో ?

RC15 : మెగా మూవీలో శాండల్ వుడ్ హీరో  ?

రెండు సినిమాలు ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల పదే పదే వాయిదా పడుతున్న విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్న హీరో రామ్ చరణ్. ఒకవైపు ఆర్ఆర్ఆర్ మరోపక్క ఆచార్య వీటిలో ఏదో ఒకటి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 4 ఆచార్య కన్ఫర్మ్ చేశారు కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయనే దాన్ని బట్టే నిర్ణయాలు ఉంటాయి. రాజమౌళితో పాటు నెలకు పైగా విస్తృతమైన ప్రమోషన్లలో పాల్గొన్న చరణ్ ఇప్పుడు తన దృష్టి మొత్తం శంకర్ సినిమా మీద పెట్టాడు. ఆర్ఆర్ఆర్ ఈవెంట్స్ కోసమే తీసుకున్న బ్రేక్ పూర్తవ్వడంతో శంకర్ నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ని ప్లాన్ చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా ఇందులో విలన్ గా కిచ్చ సుదీప్ ఫిక్స్ అయ్యారని ముంబై టాక్. అఫీషియల్ గా ఇలాంటివి అంత సింపుల్ గా చెప్పరు కాబట్టి ఏదైనా మంచి సందర్భం చూసుకుని అప్పుడు రివీల్ చేస్తారని అంటున్నారు. అయినా కూడా వచ్చేదాకా నమ్మలేం. సుదీప్ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. ఈగలో విలన్ గా నటించాకే టాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాహుబలి, సైరా నరసింహారెడ్డిలో చేసినవి చిన్న క్యారెక్టర్లు కావడంతో పెద్దగా ప్రయోజనం కలగలేదు. కానీ శంకర్ మూవీలో ప్రతినాయకుడు ఎలా ఉంటాడో మనకు తెలిసిందే. హీరోతో సమానంగా పర్ఫెక్ట్ ఎలివేషన్లు ఇచ్చి క్యారెక్టరైజేషన్లు డిజైన్ చేయడంలో శంకర్ దిట్ట.

సో ఈ కారణంగా సుదీప్ ఎస్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో రామ్ గోపాల్ వర్మ అడిగాడన్న ఒకే కారణంతో ఆయన సినిమాల్లో తన పాత్ర నిడివి ఎంతో పెట్టించుకోకుండా చేశాడు. అలాంటిది శంకర్ ఫుల్ లెన్త్ ఇస్తే వద్దంటాడా. నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో సుదీప్ చెలరేగిపోతాడు. ఒకవేళ ఈ వార్త కనక నిజమైతే ధృవ తర్వాత ఆ స్థాయి హీరో విలన్ క్లాష్ ని చూడొచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జయరాం, ఆనంద్, సునీల్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా వేసవికి రిలీజ్ ని టార్గెట్ చేసుకున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే

Also Read : Maanaadu Remake : టైం లూప్ సినిమాని మళ్ళీ తీయబోతున్నారా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి