iDreamPost

OTT : కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్-2 రెడీ! స్ట్రీమింగ్ ఎప్పుడునుండంటే?

  • Published Feb 14, 2024 | 7:01 PMUpdated Mar 14, 2024 | 4:49 PM

ప్రస్తుతం అందరి చూపు ఓటీటీలో విడుదల కాబోయే చిత్రాలవైపే. థియేటర్ లో సినిమాలను మిస్ అయిన చాలా మంది .. ఆ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో అడుగుపెడతాయ అని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తూ ఉంటారు.

ప్రస్తుతం అందరి చూపు ఓటీటీలో విడుదల కాబోయే చిత్రాలవైపే. థియేటర్ లో సినిమాలను మిస్ అయిన చాలా మంది .. ఆ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో అడుగుపెడతాయ అని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం కూడా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తూ ఉంటారు.

  • Published Feb 14, 2024 | 7:01 PMUpdated Mar 14, 2024 | 4:49 PM
OTT : కేరళ క్రైమ్ ఫైల్స్  సీజన్-2 రెడీ! స్ట్రీమింగ్ ఎప్పుడునుండంటే?

ప్రస్తుతం ఓటీటీలో విడుదల అయ్యే సిరీస్ లు, సినిమాల కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. వీటిలో ముఖ్యంగా ప్రేక్షుకులు.. మర్డర్ సస్పెన్స్ థ్రిల్లెర్స్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో మూవీ మేకర్స్ కూడా ఒక సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి .. మరో సీజన్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కేరళ క్రైమ్ సిరీస్ కు .. సెకండ్ సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అదే గతంలో ఎంతో ఆదరణ పొందిన కేరళ క్రైమ్ ఫైల్స్. ఇప్పుడు దానిని పొడిగిస్తూ.. కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2ను అనౌన్స్ చేశారు. ఈ క్రైమ్ స్టోరీ మలయాళం నుంచి వచ్చింది. కాగా, దీనికి అహ్మద్ ఖబీర్ దర్శకత్వం వహించాడు. అయితే, ఈ క్రైమ్ స్టోరీ మొదటి సీజన్ ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇక సీజన్ 2 కూడా .. త్వరలో ప్రసారం కానుంది.

అయితే , ఈ కేరళ క్రైమ్ స్టోరీ .. మలయాళం నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ గా .. మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 2ను అనౌన్స్ చేసి .. దానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. పైగా ఈ పోస్టర్ ద్వారా ఈ సీజన్ లో ఉండే కొత్త క్రైమ్ ఏంటో కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టున్నారు. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ ను బట్టి .. ఈ సీజన్ లో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి క్రైమ్స్ చుట్టూ ఈ స్టోరీ ఉండవచ్చని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఈ విషయాన్నీ స్వయంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ .. “వెలికితీసిన ఓ క్రైమ్ కొత్త చాప్టర్ వేచి చూస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్, కేరళ ఫైల్స్ సీజన్ 2 త్వరలోనే” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్నీ ప్రకటించింది. కానీ, ఈ కొత్త సీజన్ ఎప్పటినుంచి ప్రసారం అవుతోంది అనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.

కాగా , కేరళ క్రైమ్ మొదటి సీజన్ .. సాధార‌ణంగా క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాలు, సిరీస్‌లకు పూర్తి భిన్నంగా సాగుతుంది. అసలు ఓ మ‌ర్డ‌ర్ కేసును పోలీసులు నిజంగా ఎలా ఇన్వేస్టిగేట్ చేస్తారు? ఈ క్ర‌మంలో వారికి ఎదుర‌య్యే సవాళ్లు ఏంటి అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు ఈ సిరీస్ లో చూపించారు. కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ కు బహుల్ రమేష్ కథ అందించారు. అలాగే ఉద్యోగ‌ బాధ్య‌త‌ల‌కు, వ్య‌క్తిగ‌త జీవితానికి మ‌ధ్య పోలీసులు ఎదుర్కొనే అనేక రకమైన సంఘర్షణలను కూడా .. ఈ సిరీస్ లో అర్ధవంతంగా చూపించారు. ఇక ఇప్పుడు రాబోయే రెండవ సీజన్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి. మరి, కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి