iDreamPost

ఆగస్ట్ 5 – ట్రయాంగిల్ వార్ తప్పదా ?

ఆగస్ట్ 5 – ట్రయాంగిల్ వార్ తప్పదా ?

ఎంత వద్దనుకున్నా బాక్సాఫీస్ వద్ద ఫ్రైడే క్లాష్ లు తప్పడం లేదు. ఓపెనింగ్స్ ప్రభావం చెందే అవకాశం ఉన్నా, జనం పూర్తి స్థాయిలో థియేటర్లకు రాలేకున్నా తప్పని పరిస్థితుల్లో నిర్మాతలు పోటీకి సై అంటున్నారు. కాకపోతే ఒకే రేంజ్ హీరోలు తలపడితేనే డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడతారు. అందులోనూ ఒకే జానర్ అయినప్పుడు ఇక చెప్పేదేముంది. ఆగస్ట్ 5 కళ్యాణ్ రామ్ బింబిసార రాబోతున్న సంగతి తెలిసిందే. వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ ఫాంటసీ డ్రామాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటు తర్వాత రెండు మూడు భాగాలు కూడా వస్తాయని కళ్యాణ్ రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నొక్కి చెప్పాడు.

దీన్ని బట్టి కంటెంట్ మీద ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. అదే రోజు నిఖిల్ కార్తికేయ 2 రాబోతోంది. చందూ మొండేటి డైరక్షన్ లో రూపొందిన ఈ థ్రిల్లర్ ఫాంటసీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అనుపమ్ ఖేర్ మొదటిసారి దీని ద్వారానే టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నారు. పోస్టర్లు టీజర్ లో విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తికేయకు సీక్వెల్ కాకపోయినా దాన్ని మించిన థ్రిల్స్ ఇందులో ఉంటాయని యూనిట్ ఊరిస్తోంది.


మరి కళ్యాణ్ రామ్ నిఖిల్ లు ఫేస్ టు ఫేస్ తలపడటం సమస్యే. ఇవి చాలవన్నట్టు దుల్కర్ సల్మాన్ సీతా రామమ్ కూడా అదే డేట్ కి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇది పూర్తిగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ

ఈ ట్రయాంగిల్ వార్ చూస్తుంటే ఒకరు వెనక్కు తగ్గడం బెటర్ అనిపిస్తోంది. ఆ మేరకు సంప్రదింపులు కూడా మొదలయ్యాయట. బింబిసారని ఆగస్ట్ 12కి వెళ్లేలా చూస్తున్నారు కానీ అదే రోజు నితిన్ మాచర్ల నియోజకవర్గం ఉంది. దానికి ముందు రోజు లాల్ సింగ్ చడ్డా, కోబ్రాలు వస్తున్నాయి. సో కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది. అంతకన్నా లేట్ చేస్తే ప్రొడ్యూసర్లకు పెట్టుబడుల భారం. ఇప్పటికీ బింబిసార, కార్తికేయ 2 రెండూ పలు వాయిదాల వల్ల ఇబ్బంది పడ్డవే. ఒకవేళ నిజంగా దీనికే కట్టుబడితే మాత్రం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్రమోషన్లు మాత్రం తగ్గేదేలే అనే తరహాలో ఎవరికి వారు చేసుకుంటున్నారు. చూడాలి ఏం జరగనుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి