iDreamPost

ధోని టీమ్మెట్‌.. ప్రపంచకప్‌ గెలిపించాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే!

  • Published Jun 24, 2023 | 1:15 PMUpdated Jun 24, 2023 | 1:15 PM
  • Published Jun 24, 2023 | 1:15 PMUpdated Jun 24, 2023 | 1:15 PM
ధోని టీమ్మెట్‌.. ప్రపంచకప్‌ గెలిపించాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే!

ప్రపంచంలో క్రికెట్‌ను ఓ మతంగా అభిమానించి.. ఆదరించే దేశం.. కేవలం ఇండియా మాత్రమే అయ్యి ఉంటుంది. మనదేశంలో క్రికెట్‌కున్న ఆదరణ ఏ క్రీడలకు లేదు. సినిమా హీరోలకు ధీటుగా క్రికెటర్లకు అభిమానులుంటారు. ఫేవరెట్‌ క్రికెటర్ల కోసం ఫ్యాన్స్‌ ఏకంగా కొట్టుకుంటారు. అయితే అందరూ క్రికెటర్లు ఇదే రేంజ్‌లో వెలిగిపోతారు.. గుర్తింపు తెచ్చుకుంటారా అంటే అది సాధ్యం కాదు. కొన్ని మ్యాచ్‌లలో హీరోలుగా నిలిచిన వాళ్లు.. కూడా తర్వాత కనుమరుగవుతారు. క్రికెట్‌ ద్వారా వచ్చే క్రేజ్‌, స్టార్‌డమ్‌ను నిలుపుకోవడం అందరికి సాధ్యం కాదు. మరి కొందరేమో.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి.. మనసుకు నచ్చిన కెరీర్‌ ఎంచుకుంటారు అలాంటి ఓ క్రికెటర్‌ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.

క్రికెట్‌లో వరల్డ్‌ కప్‌ గెలవడం ఓ కల. ప్రతి ఆటగాడు తన కెరీర్‌ ముగిసేలోపు.. ఒక్కసారైనా వరల్డ్‌కప్‌ గెలవాలని.. ఆ జట్టులో తాను ఉండాలని కలలు కంటాడు. కొందరు ఆటగాళ్లు.. మాత్రమే ఇలాంటి అరుదైన అదృష్టం అందుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకొబోయే క్రికెటర్‌ కూడా ఆ కోవకు చెందినవాడే. ధోని అధ్వర్యంలో వలర్డ్‌కప్‌ గెలిచి.. హీరోగా నిలిచిన ఆ క్రికెటర్‌.. ఆ తర్వాత కనుమరుగయ్యాడు. మరి ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడు.. అంటే…

క్రికెట్‌లో స్టార్‌లుగా రాణించిన వాళ్లు.. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వత కామెంటేటర్‌, కోచ్‌, అడ్మినిస్ట్రేటర్‌లుగా రాణిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రికెటర్‌ వరల్డ్‌కప్‌ విన్నర్‌ టీమ్‌లో రాణించి.. హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతటి క్రేజ్‌ సంపాదించున్న ఆ క్రికెటర్‌.. ఆ తర్వాత అనూహ్యంగా ఆటను వీడి.. విభిన్నమైన కెరీర్‌ను ఎంచుకున్నాడు. మిగతా వారికి భిన్నంగా.. పోలీస్‌ జాబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడ. అతడే 2007 వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో ఆడిన జోగిందర్‌ శర్మ. 2007లో ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నిలో భారత్‌ను విజయ తీరాలకు చేర్చిన హీరోగా జోగిందర్‌ శర్మ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన టీమిండియా.. తుదిపోరులో దాయాది పాకిస్తాన్‌ మీద తలపడి.. పాక్‌ జట్టును ఓడించి.. మరిచిపోలేని విజయాన్ని సాధించింది.

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో..

దక్షిణాఫ్రికాలోని.. జొహన్నాస్‌బర్గ్‌లోని ది వాండరర్స్‌ స్టేడియంలో.. జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌.. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ధోని సేన 5 పరుగుల తేడాతో.. పాకిస్తాన్‌ మీద విజయం సాధించి.. టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది ఇండియా. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. విజేతను నిర్ణయించే ఆఖరి ఓవర్లో .. ధోని అంతగా అనుభవం లేని జోగిందర్‌ శర్మకు బాల్‌ ఇచ్చి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. కానీ జోగిందర్‌ మాత్రం.. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆఖరి ఓవర్లో.. పాక్‌ గెలవాలంటే.. నాలుగు బాల్స్‌కి 6 రన్స్‌ చేయాలి. దాయాదిదే విజయం అని అంతా భావించారు. భారత్‌ గెలవాలంటే.. ఏదైనా అద్భుతం జరగాలి అనే పరిస్థితి.

అలాంటి సమయంలో జోగిందర్‌.. తెలివిగా బౌలింగ్‌ చేసి.. భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జోగిందర్‌ బౌలింగ్లో పాకిస్తాన్‌ క్రికెటర్‌ మిస్బా ఉల్‌ హక్‌ స్కూప్‌ షాట్‌ ఆడి.. శ్రీశాంత్‌ చేతిలో ఔటయ్యాడు. దాంతో టీ20 వరల్డ్‌ కప్‌ తొలి విజేతగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో జోగిందర్‌ మొత్తం 3.3 ఓవర్లు బౌలింగ్‌ చేసి.. రెండు వికెట్లు తీసి.. 20 పరుగులు ఇచ్చాడు. ఇక ఆ మరుసటి ఏడాది.. ఐపీఎల్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ఆడాడు జోగీందర్‌. 2008-2012 వరకు సీఎస్‌కేలోనే కొనసాగాడు. 2010, 2011లో సీఎస్‌కే ట్రోఫీ గెలిచిన సందర్భాల్లో కూడా జోగిందర్‌ భాగస్వామిగా ఉన్నాడు.

క్రికెట్‌కు గుడ్‌బై.. పోలీస్‌గా ఎంట్రీ..

1983, అక్టోబరు 23న హర్యానాలో జన్మించిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ జోగీందర్‌ శర్మ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి.. ప్రస్తుతం పోలీస్‌ అధికారిగా పనిచేస్తున్నారు. టీమిండియా ‍టీ20 ప్రపంచకప్‌ హీరోగా నిలిచిన జోగీందర్‌ను హర్యానా ప్రభుత్వం సముచితంగా సత్కరించింది. క్రికెట్‌గా గుడ్‌బై చెప్పిన జోగిందర్‌ శర్మ.. ప్రస్తుతం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ హోదాలో ఉన్నట్లు సమాచారం. కాగా జోగీందర్‌ 2007లో ఆడిన ప్రపంచకప్‌ టోర్నీలో ఫైనల్‌ మ్యాచే జోగీందర్‌ ఆడిన చివరి అంతర్జాతీయ టీ20 కూడా ఇదే. రైట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన జోగీందర్‌ 2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌.. 2011లో ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడారు.

Team india cricketer joginder sharma present life story

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి