iDreamPost

పిగ్ బట్చరింగ్ మోసాలు!.. ఏమరపాటుగా ఉన్నారో ఖాతాలు లూటీ!

సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజుకో మోసం వెలుగు చూస్తోంది. మరో కొత్త రకం మోసం పిగ్ బచ్చరింగ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పలు సూచనలు చేశారు ఆన్ లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా వ్యవస్థాపకులు, సీఈవో నితిన్ కామత్.

సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజుకో మోసం వెలుగు చూస్తోంది. మరో కొత్త రకం మోసం పిగ్ బచ్చరింగ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పలు సూచనలు చేశారు ఆన్ లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా వ్యవస్థాపకులు, సీఈవో నితిన్ కామత్.

పిగ్ బట్చరింగ్ మోసాలు!.. ఏమరపాటుగా ఉన్నారో ఖాతాలు లూటీ!

రోజుకో ఎత్తుగడలతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసాలకు గురిచేస్తున్నారు. కొత్త రకం మోసాలతో సైబర్ క్రిమినల్స్ వేల కోట్లు దండుకుంటున్నారు. ఆన్ లైన్ గిఫ్ట్స్, లాటరీల పేరిట పేక్ లింక్స్, ఫేక్ మెసేజ్ లు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు ఆర్థిక మోసాలు ఎక్కువై పోతున్నాయి. ఈ మోసాలపై ఆన్ లైన్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా వ్యవస్థాపకులు, సీఈవో నితిన్ కామత్ భారత్ లో వివిధ ఆర్థిక స్కామ్ లపై అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్ లు , హై రిటర్న్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లు, క్రిప్టో ఇన్వెస్ట్ మెంట్ స్కీంల వంటి వాటి ద్వారా ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో వెల్లడించారు.

‘పిగ్ బచ్చరింగ్’ అనేది ఒక రకమైన సైబర్ కుంభకోణం. ఆన్‌లైన్ ఫేక్ మెసేజ్ లను ఉపయోగించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్రిప్టో పెట్టుబడులు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడుల పేరిట మోసం చేస్తున్నారు. భారత్ లో పిగ్ బట్చరింగ్ స్కామ్ లో పదివేల కోట్ల వరకు మోసాలు జరిగాయని నితిన్ కామత్ వెల్లడించారు. పిగ్ బట్చరింగ్ స్కామ్ లో సైబర్ క్రిమినల్స్ ఫ్రెండ్ గా, లవర్ గా వ్యవహరిస్తారు. ఆ తరువాత బాధితుడికి నమ్మకం కలిగేల వ్యవహరిస్తారు. ఆ తరువాత ఫేక్ ఇన్వెస్ట్ మెంట్స్, ఫేక్ జాబ్స్ పేరుతో వారిని మోసం చేసి డబ్బుతో ఉడాయిస్తారు.

పిగ్ బట్చరింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది..
నేరగాళ్లు నకిలీ ప్రొఫైల్ ను వినియోగించడం ద్వారా ముందుకు వినియోగదారులు నమ్మకాన్ని పొందుతారు. స్నేహం, ప్రేమ పేరుతో నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత వారి పని ముగించుకొని కనబడకుండా పోతారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్కామ్ లు ఉన్నాయి. ఈ స్కామ్ లో అత్యంత దారుణమైన అంశం ఏంటంటే స్కామ్ చేసే వ్యక్తి మరొక రకమైన స్కామ్‌కి కూడా బాధితుడు కావచ్చు. చాలామంది స్కామీ కంపెనీలనుంచి ఫేక్ ఉద్యోగ ఆఫర్లు పొంది విదేశాలకు వెళతారు. వారు అక్కడ బందీలుగా ఉండి నకిలీ ఫేక్ ఫ్రొఫైల్ లతో ఇతరులను నమ్మించి మోసం చేయాల్సి వస్తుందని నితిన్ కామత్ తెలిపారు.

పిగ్ బచ్చరింగ్ స్కామ్ ఎలా నివారించాలి?

వాట్సాప్, సోషల్ మీడియా వేదికల్లో, డేటింగ్ యాప్స్ ద్వారా వచ్చే మెసేజ్ లకు ఎట్టి పరిస్థితుల్లో రిప్లై ఇవ్వకూడదు.
ఎవరైనా కొత్త యాప్ లను డౌన్ లోడ్ చేసుకోమని లేదా పంపించిన లింక్స్ ఓపెన్ చేయమని కోరితే స్పందించకూడదు.
మీకు అనుమానం కలిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కు లేదా లాయర్ ను సంప్రదించండి.
జాబ్ ఆఫర్స్, హై రిటర్న్స్ ఇస్తామని చెప్పే వాగ్ధానాలను నమ్మకూడదు.
వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదు. ఆధార్, పాస్ పోర్ట్, బ్యాంక్ డిటేయిల్స్ వంటివి షేర్ చేసుకోవద్దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి