iDreamPost

ఫాదర్స్ డే స్పెషల్: IAS అయిన కూతురికి సెల్యూట్ చేసిన IPS తండ్రి

కూతురు ఐఏఎస్ కాగా ఐపీఎస్ అయిన ఆమె తండ్రి సెల్యూట్ చేశాడు. ఈ అరుదైన ఘటన రాజ్‌బహదూర్‌ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో చోటుచేసుకుంది.

కూతురు ఐఏఎస్ కాగా ఐపీఎస్ అయిన ఆమె తండ్రి సెల్యూట్ చేశాడు. ఈ అరుదైన ఘటన రాజ్‌బహదూర్‌ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో చోటుచేసుకుంది.

ఫాదర్స్ డే స్పెషల్: IAS అయిన కూతురికి సెల్యూట్ చేసిన IPS తండ్రి

తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. వారి ఫ్యూచర్ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. పిల్లలే లోకంగా జీవిస్తుంటారు. తాము కన్న కలల్ని నిజం చేయాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తుంటారు. బిడ్డలు చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందుతారు. ఇదే విధంగా ఓ తండ్రీ అమితమైన ఆనందాన్ని పొందాడు. కూతురు ఐఏఎస్ అధికారిణి కాగా ఐపీఎస్ అయిన తండ్రి ఆమెకు సెల్యూట్ చేశాడు. ఈ ఘటన రాజ్‌బహదూర్‌ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో చోటుచేసుకుంది.

రాజ్‌బహదూర్‌ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీకీ శనివారం ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు ప్రాక్టికల్‌ ట్రైనింగ్ కోసం వచ్చారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ అధికారిణిగా పోలీస్‌ అకాడమీకి వచ్చిన కుమార్తెకు ఆ పోలీస్‌ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్‌ తండ్రి సెల్యూట్‌ చేశాడు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం వచ్చిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులకు పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ కు బదులుగా జాయింట్‌ డైరెక్టర్‌ డీ మురళీధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ వేంకటేశ్వర్లు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

కాగా పోలీస్‌ అకాడమీకి ప్రాక్టికల్‌ ట్రైనింగ్ కోసం వచ్చిన ఏడుగురు 2023 బ్యాచ్‌ ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారుల్లో ఉమా భారతి ఒకరు. అయితే వీరికి సెల్యూట్‌ చేసి స్వాగతం పలికిన అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ వేంకటేశ్వర్లు కుమార్తే ఐఏఎస్ అధికారిణి. ఆయన ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి ఉమా భారతికి కన్నతండ్రి. ఐఏఎస్‌ అధికారిణిగా వచ్చిన బిడ్డకు ఐపీఎస్‌ తండ్రి సెల్యూట్‌ చేసిన ఈ ఘటన అకాడమీలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఐఏఎస్ అయిన కూతురు, ఐపీఎస్ అయిన తండ్రి సక్సెస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తండ్రీతో ఐఏఎస్ హోదాలో సెల్యూట్ స్వీకరించిన ప్రస్తుతం ఉమాభారతి వికారాబాద్‌ జిల్లాలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి