iDreamPost

IPL వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకే ఎందుకింత క్రేజ్ అంటే?

Australia Players Got Huge Craze In IPL 2024 Auction: 2024 ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొడుతున్నారు. అయితే అసలు వారికి ఎందుకింత క్రేజ్ అనే విషయాన్ని పరిశీలిద్దాం.

Australia Players Got Huge Craze In IPL 2024 Auction: 2024 ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొడుతున్నారు. అయితే అసలు వారికి ఎందుకింత క్రేజ్ అనే విషయాన్ని పరిశీలిద్దాం.

IPL వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకే ఎందుకింత క్రేజ్ అంటే?

ఐపీఎల్ 2024 మినీ వేలం నరాలు తెంపే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రికార్డు ధరలకు ఆటగాళ్లు అమ్ముడుబోతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకి చెందిన ప్లేయర్స్ ఈ మినీ వేలంలో హాటు కేకుల్లా మారిపోయారు. ఇండియన్ ప్లేయర్స్ కు కూడా దక్కని, ఊహించలేని స్థాయిలో ధరలు పలుకుతున్నారు. ఫ్రాంచైజీలు వీరికే ఎందుకింత ధర పెట్టి కొనుగోలు చేస్తోంది అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇన్నిన్ని కోట్లు పెట్టి ఫ్రాంచైజీలు కొంటున్నాయంటే అది సరదాకి కాదు.. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. మరి ఆ కారణాలేంటో చూద్దాం.

ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొట్టారు. మరో ఆటగాడు బ్రేక్ చేయలేడేమో అనే విధమైన రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరగిన వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేశారు. మొదట పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని విధంగా రూ.20.50 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అందరూ ఏంటి కావ్యా ఇంత ధరకు కొనుగోలు చేసింది అంటూ నోరెళ్లబెట్టారు. అప్పటికే ఆస్ట్రేలియాకి చెందిన ట్రావిస్ హెడ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసి ఉంది. మళ్లీ ఇన్నికోట్లు పెట్టి కమ్మిన్స్ ని ఎందుకు కొన్నారు అంటూ ప్రశ్నించారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక బలమైన, జాతీయ జట్టుకు కెప్టెన్ వ్యవహరించి, కప్పులు సాధించిన ఒక కెప్టెన్ లేడనే చెప్పాలి. అందుకే ఆ వెలితిని పూడ్చడానికే ఎస్ఆర్ హెచ్.. కమ్మిన్స్ ని రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిందని చెప్పాలి.

ఇదే ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ రికార్డును కూడా తుడిచిపెట్టేయడానికి మిచెల్ స్టార్క్ ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్ లో అడుగుపెడుతున్న స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోరాడాయి. అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అసలు ఇలాంటి ఒక ధరకు ప్లేయర్ ని కొంటారని ఏ క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు.. క్రికెట్ నిపుణులు కూడా ఊహించి ఉండరు. కానీ, మిచెల్ స్టార్క్ మాత్రం అలాంటి ఒక క్రేజీ నంబర్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. 2018లో ఆర్సీబీ నుంచి కోల్ కతా జట్టులోకి వచ్చిన స్టార్క్ గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత రీఎంట్రీ కూడా కోల్ కతా తరఫునే ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఎందుకు ఇంత క్రేజ్ అనే ప్రశ్నకు 2 కారణాలు ఉన్నాయి.

మొదటి కారణం వరల్డ్ కప్.. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ 2023ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ లోకి ఎంటర్ అయిన టీమిండియాని ఆస్ట్రేలియా జట్టు ఓడించి కప్పు కొట్టుకుపోయింది. అలాంటి జట్టుకు కెప్టెన్ గా చేసిన పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అలాగే ఆ జట్టులో అద్భుతమైన పేసర్ గా రాణించిన మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే కేవలం వరల్డ్ కప్ గెలిచారనే కారణంతోనే వీళ్లను ఇన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ పేసర్లలో మిచెల్ స్టార్క్ కూడా ఒకడు. అత్యంత వేగంగా మాత్రమే కాకుండా.. అంత వేగంలో కూడా లైన్ అండ్ లెంగ్త్ ని మిస్ అవ్వకుండా స్టార్క్ బౌలింగ్ చేయగలడు. అంతేకాకుండా అంత వేగంలో కూడా స్టార్క్ బంతిని స్వింగ్ చేయగలడు. అందుకే కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్ని కోట్లు పెట్టి స్టార్క్ ని కొనుగోలు చేసింది. మరి.. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి