iDreamPost

iOS 18: ఐఫోన్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ప్రతి నెలా బోలెడంత డబ్బు..

iOS 18: మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రతి నెలా బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. ప్రతి నెలా కొన్ని యాప్స్ కోసం మీరు భారీగా డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఇక ఆ పంచాయితీ ఉండదు. యాపిల్ కంపెనీ ఐఓఎస్ 18 అప్డేట్ తో ఈ ఫీచర్స్ అన్నీ ఫ్రీగా వస్తున్నాయి.

iOS 18: మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ప్రతి నెలా బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. ప్రతి నెలా కొన్ని యాప్స్ కోసం మీరు భారీగా డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఇక ఆ పంచాయితీ ఉండదు. యాపిల్ కంపెనీ ఐఓఎస్ 18 అప్డేట్ తో ఈ ఫీచర్స్ అన్నీ ఫ్రీగా వస్తున్నాయి.

iOS 18: ఐఫోన్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. ఇక నుంచి ప్రతి నెలా బోలెడంత డబ్బు..

ఐఫోన్ యూజర్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూసే. ఎందుకంటే ఇక నుంచి ప్రతి నెలా బోలెడంత డబ్బు ఆదా అవుతుంది. దీని వల్ల ప్రతి నెలా ఆ డబ్బంతా లాభమే. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఇప్పుడు పెయిడ్ యాప్స్ కి రీప్లేస్ గా కొన్ని ఇన్ బిల్ట్ ఫీచర్స్ ని ఐఓఎస్ 18 అప్డేట్ లో తీసుకొస్తుంది. ఐఫోన్ లో ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్నన్ని ఫీచర్స్ ఉండవు. చాలా వరకూ పెయిడ్ యాప్సే ఉంటాయి. ప్రతి నెలా డబ్బులు చెల్లించే పరిస్థితి ఉంటుంది. అయితే ఐఓఎస్ 18 అప్డేట్ తో ఈ డబ్బులన్నీ ఆదా కానున్నాయి. పెయిడ్ యాప్స్ కి రీప్లేస్ చేస్తూ యాపిల్ కొన్ని ఫీచర్స్ ని ఇన్ బిల్ట్ గా తీసుకొస్తుంది. మరి ఆ ఫీచర్స్ ఏంటో ఓ లుక్కేయండి.     

పాస్వర్డ్ ,మేనేజర్:

అమెజాన్, ఫ్లిప్ కార్ట్, నెట్ ఫ్లిక్స్, గూగుల్ ఇలా రకరకాల యాప్స్ కి సంబంధించిన లాగిన్ వివరాలను, పాస్వర్డ్స్ ని ఒక చోట మేనేజ్ చేయడానికి యాపిల్ డివైజెస్ లో థర్డ్ పార్టీ యాప్స్ ని వాడుతుంటారు. వీటికి ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఐఓఎస్ 18 సొంత స్టాండ్ అలోన్ పాస్వర్డ్ మేనేజర్ ని పరిచయం చేసింది. దీని వల్ల పాస్వర్డ్స్ ని మేనేజ్ చేయడం కోసం థర్డ్ పార్టీ యాప్స్ ని డబ్బులిచ్చి కొనక్కర్లేదు. పాస్వర్డ్ లు, పాస్ కీలు, కోడ్స్ వంటివి ఇప్పుడు ఐఓఎస్ 18 హ్యాండిల్ చేస్తుంది. యాపిల్ పాస్వర్డ్ లు ఐ క్లౌడ్ ఎక్స్ టెన్షన్ ద్వారా క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వంటి థర్డ్ పార్టీ వెబ్ బ్రౌజర్స్ తో కూడా పని చేస్తుంది.     

గ్రామర్లీ:

స్పెల్లింగ్స్, గ్రామర్ మిస్టేక్స్ వంటివి సరిచేయడం కోసం గ్రామర్లీ అనే థర్డ్ పార్టీ యాప్ ని యాపిల్ డివైజెస్ లో వాడతారు. గ్రామర్లీ అనేది ఏఐ పవర్డ్ టెక్స్ట్ చెక్ చేయడం, రీరైట్ చేయడం వంటివి చేస్తుంది. అయితే ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే మాత్రం కొనుక్కోవాల్సిందే. అయితే డబ్బులతో కొనుక్కునే పని లేకుండా ఫ్రీగా ఇప్పుడు ఐఓఎస్ 18 యాపిల్ ఇంటిలిజెన్స్ తో వస్తుంది. దీని ద్వారా మీరు టెక్స్ట్ ని మరలా రాయమని.. టెక్స్ట్ టోన్ ని మార్చమని అడగవచ్చు.  

ఆటర్ ఏఐ:

వాయిస్ ని టెక్స్ట్ గా మార్చడానికి ఆటర్ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది. అయితే దీని ద్వారా 30 నిమిషాల ఫైల్స్ వరకే పని చేస్తుంది. నెలకు 300 నిమిషాల టెక్స్ట్ ని మాత్రమే ఇస్తుంది. ఇంకా ఎక్కువ సమయం వాయిస్ ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేయాలంటే డబ్బులు చెల్లించాలి. అయితే ఐఓస్ 18లో మాత్రం ఎలాంటి పరిమితి లేదు. ఎంత సమయమైనా వాయిస్ ని టెక్స్ట్ గా ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు.   

కాల్ రికార్డ్:

ఐఫోన్ లో కాల్ రికార్డ్ ఆప్షన్ ఉండదు. ఫోన్ కాల్ లో ఉండగా కాల్ రికార్డ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీని కోసం ప్రతి నెలా అనవసరంగా డబ్బు ఖర్చు. అందులో కూడా ఇన్ని కాల్స్ వరకే రికార్డ్ చేసే లిమిట్ ఉంటుంది. ఎక్కువ కాల్స్ రికార్డ్ చేయాలంటే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఐఓఎస్ 18లో ఇప్పుడు ఫోన్ యాప్ లో కాల్ రికార్డ్ ఫీచర్ ని ఉంచారు. దీంతో కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే ఆ కాల్స్ ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. 

చాట్ జీపీటీ ప్లస్:

ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో ఏఐ చాట్ బాట్ యాక్సెస్ కోసం మీరు ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ ఏఐతో యాపిల్ ఒప్పందం వల్ల ఐఓఎస్ 18లో సిరిలో చాట్ జీపీటీ ఫీచర్స్ వస్తాయి. దీని వల్ల ప్రతి నెలా ఏఐ చాట్ బాట్ కోసం డబ్బులు చెల్లించే పని ఉండదు. ఫ్రీగా ఈ ఫీచర్ ని పొందవచ్చు. 

శాటిలైట్ మెసెంజర్:

2022లో ఐఫోన్ 14 లాంఛ్ అయినప్పటి నుంచి ఐఓఎస్ యూజర్లకి.. ట్రబుల్ లో ఉన్నప్పుడు లేదా సెల్యులార్ నెట్వర్క్ కవరేజ్ లేని సమయంలో ఉంటే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ మెసేజ్ ని సెండ్ చేసే వెసులుబాటు కల్పించింది కంపెనీ. ఐఓఎస్ 18తో ఏ టెక్స్ట్ అయినా సరే అవసరమైతే శాటిలైట్ ద్వారా పంపబడుతుంది. దీని వల్ల మీరు నెట్వర్క్ కవరేజి లేని సమయంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో టచ్ లో ఉండచ్చు. అయితే ఈ ఫీచర్ కి యాపిల్ కంపెనీ కొంత డబ్బు ఛార్జ్ చేస్తుంది అన్న వార్తలు వచ్చాయి కానీ ఈ ఫీచర్ పూర్తిగా ఉచితం. కాబట్టి డబ్బులు చెల్లించి వేరే శాటిలైట్ మెసెంజర్ ని డివైజ్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు.    

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి