iDreamPost

20 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్.. వైర్‌లెస్ ఛార్జర్ సహా అనేక ఫీచర్స్

Best 5G Phone With Wireless Charging: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై ఓ లుక్కేయండి. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ తో కొత్తగా వస్తుంది. వైర్ లెస్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేయడమే కాకుండా 108 మెగా పిక్సెల్ సూపర్ జూమ్ కెమెరాతో వస్తుంది.

Best 5G Phone With Wireless Charging: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై ఓ లుక్కేయండి. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ తో కొత్తగా వస్తుంది. వైర్ లెస్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేయడమే కాకుండా 108 మెగా పిక్సెల్ సూపర్ జూమ్ కెమెరాతో వస్తుంది.

20 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్.. వైర్‌లెస్ ఛార్జర్ సహా అనేక ఫీచర్స్

స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. 20 వేల లోపు బడ్జెట్ లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంఛ్ కాబోతుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీని ఫీచర్స్ విషయానికొస్తే.. 108 మెగాపిక్సెల్ సూపర్ జూమ్ కెమెరా, 2 ఎంపీ, 2 ఎంపీ రేర్ కెమెరాలతో వస్తుంది. అలానే 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 4కే రిజల్యూషన్ లో సెకనుకి 30 ఫ్రేమ్స్, 1080 పిక్సెల్ లో సెకనుకి 60 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, 720 పిక్సెల్ లో సెకనుకి 30 ఫ్రేమ్స్ వీడియో రికార్డింగ్ తో వస్తుంది. జేబీఎల్ సౌండ్ తో డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. 120 హెట్జెస్ అమోలెడ్ డిస్ల్పేతో వస్తుంది. 1080 పిక్సెల్ రిజల్యూషన్ తో.. 1300 నిట్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. డైమెన్సిటీ 7020 5జీ చిప్ సెట్ తో వస్తుంది. ఎక్స్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది.

8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ర్యామ్ ని 24 జీబీ వరకూ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇందులో మూడు మోడ్స్ ఉన్నాయి. లో టెంప్, స్మార్ట్, హైపర్ మోడ్స్ ఉన్నాయి. లో టెంప్ లో హైపర్ మోడ్ తో పోలిస్తే టెంపరేచర్ 10 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. స్మార్ట్ మోడ్ లో 31 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అయ్యేలా దీన్ని రూపొందించారు. హైపర్ మోడ్ లో 26 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ ఎక్కేలా డిజైన్ చేశారు. 10 నిమిషాలు ఛార్జింగ్ తో 1.8 గంటల సేపు గేమ్స్ ఆడచ్చు. 5.7 గంటలు కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. 4.4 గంటలు వీడియోలు చూసుకోవచ్చు. 3.2 గంటల పాటు మ్యాప్ నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు.

33 వాట్ ఆల్ రౌండ్ ఫాస్ట్ ఛార్జ్ 2.O, 15 వాట్ వైర్ లెస్ మ్యాగ్ ఛార్జ్ ఫీచర్స్ తో ఇది వస్తుంది. మ్యాగ్ కేస్, మ్యాగ్ ప్యాడ్, మ్యాగ్ పవర్ ఇలా వీటితో వైర్ లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇన్ఫినిక్స్ మ్యాగ్ కిట్ ని కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఫోన్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓటీజీ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఐపీ53 స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తుంది. అంటే డస్ట్, వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. యాక్టివ్ హేలో అనే ఏఐ లైటింగ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో పరిచయం చేస్తుంది.

ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, ఛార్జింగ్, గేమ్స్, మ్యూజిక్, వాయిస్ అసిస్టెంట్ ఇలా వీటికి డిఫరెంట్ లైటింగ్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఇది టైటాన్ గోల్డ్, ఒబ్సిడియన్ బ్లాక్ రెండు రంగుల్లో వస్తుంది. టెక్ నిపుణుల అంచనా ప్రకారం దీని ధర రూ. 20 వేల లోపే ఉంటుంది. ఇక ఈ ఫోన్ ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా పలు దేశాల్లో అందుబాటులో ఉంది. భారత్ మార్కెట్లోకి జూన్ 21న ప్రవేశించనుంది.   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి