iDreamPost

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెకీ..భావోద్వేగ వీడియో

  • Published Jun 12, 2024 | 6:32 PMUpdated Jun 12, 2024 | 6:32 PM

ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాల‌తో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా లేఆఫ్ బాధితుడు కావడంతో.. తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వ్యక్తం చేశాడు.

ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాల‌తో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా లేఆఫ్ బాధితుడు కావడంతో.. తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వ్యక్తం చేశాడు.

  • Published Jun 12, 2024 | 6:32 PMUpdated Jun 12, 2024 | 6:32 PM
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెకీ..భావోద్వేగ వీడియో

చాలామంది ఐటీ హబ్ లో ఉద్యోగం చేయలని కలలు కంటారు. ఎందుకంటే ఈ ఉద్యోగంలో ఉండే వెసులబాటు మరెక్కడ ఉండదని అభిప్రాయ పడతారు. ముఖ్యంగా ఈ ఉద్యోగంలో లక్షల్లో జీతాలు, వారంలో రెండు రోజులు సెలవులు, పైగా పెద్ద పెద్ద అద్దాల మేడాల్లో ఏసీ కింద కూర్చొని పని చేయవచ్చు. కనుక చాలామంది ఈ ఉద్యోగం చేయాడానికి ఆసక్తి చూసిస్తుంటారు. కానీ, ప్రస్తుతం కాలంలో ఈ ఐటీ రంగంలో ఊహించని ఉద్యోగ కోతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా కరోనా మహమ్మరి కారణంగా ఆయా రంగాల్లో ఉద్యోగులపై లేఆఫ్స్ అయ్యే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. కాగా, వీటిలో ఎక్కువ శాతం దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నారు. ఈ క్రమంలోనే లేఆఫ్ బాధితుడు భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఓ వీడియో షేర్ చేస్తూ తన ఆవేదను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాల‌తో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా యూఎస్ కు చెందిన    ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా లేఆఫ్ బాధితుడు కావడంతో.. తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వ్యక్తం చేశాడు. అయితే ఆ వీడియోలో ఆ ఉద్యోగి మాట్లాడుతూ..  ‘నన్ను ఉద్యోగం నుంచి తొలిగించడానికి ముందు ఓ ఇంటర్వ్యూ  చేశారు. ఇక ఆ ఇంటర్వ్యూలో నా టీమ్‌ సభ్యుల స్థానంలో భారతీయులను నియమిస్తామని సంస్థ చెప్పడంతో నేను షాకయ్యాను. అప్పుడే నేను కూడా భారతీయుడినని చెప్పాను.

కానీ, వాళ్లకు భారత్ నుంచి వచ్చినవాళ్లే కావాలంట, ఎందుకంటే వారు తక్కువ వేతనానికే పని చేస్తారని కంపెనీ చెప్పింది. ఇక ఈ విషయం విని నేను చాలా షాక్ అయ్యాను.   నేను కూడా ఇండియాలోనే పుట్టానని, రెండేళ్లున్నప్పుడు కుటుంబంతో పాటు అమెరికా వచ్చినట్లు చెప్పాను. ఇక నేను ఎంత  చెప్పినా వాళ్లు నా మాటలు వినిపించుకోలేదు. నాతో పాటు నా సహ ఉద్యోగులను సైతం తొలగించేశారని’ తన ఆవేదనను వెల్లడించి ఆ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇప్పటి వరకు ఈ వీడియోలో 3.5 మిలియన్ల మంది వీక్షించగా.. 40 వేలకుపైగా లైక్‌లు వచ్చాయి. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.. ‘బహుశా నువ్వు ఖరీదైపోయి ఉంటావ్‌ బ్రో’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు స్టాండప్‌ కమెడియన్‌గా మంచి భవిష్యత్‌ ఉంది ట్రై చేయొచ్చు కదా అంటూ మరొ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా రకరకాలుగా నెటిజన్స్ ఆ వీడియో పై కామెంట్స్ పెడుతున్నారు. మరి, భారతీయుడు కాదని కారణంతో ఉద్యోగం నుంచి తొలగించిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి