iDreamPost

Virat Kohli: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​కు దూరం.. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న కోహ్లీ..!

  • Author singhj Updated - 03:43 PM, Fri - 8 December 23

సౌతాఫ్రికా సిరీస్​కు టీమిండియా రెడీ అయిపోయింది. అయితే ఆ సిరీస్​లో టీ20 టీమ్​లో ఆడకుండా విరాట్ కోహ్లీ తప్పు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

సౌతాఫ్రికా సిరీస్​కు టీమిండియా రెడీ అయిపోయింది. అయితే ఆ సిరీస్​లో టీ20 టీమ్​లో ఆడకుండా విరాట్ కోహ్లీ తప్పు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

  • Author singhj Updated - 03:43 PM, Fri - 8 December 23
Virat Kohli: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​కు దూరం.. మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న కోహ్లీ..!

సౌతాఫ్రికా టూర్​కు టీమిండియా రెడీ అయిపోయింది. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ పర్యటన డిసెంబర్ 10వ తేదీన జరిగే తొలి టీ20తో మొదలుకానుంది. జనవరి 7వ తేదీన ఈ టూర్ ముగిసిపోతుంది. సఫారీ గడ్డపై మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది భారత్. ఈ సిరీస్​లో మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లకు నియమించారు సెలక్టర్లు. పొట్టి ఫార్మాటైన టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలను మోయనున్నారు. ఈ పర్యటనలో జరిగే వన్డే, టీ20 సిరీస్​లకు రోహిత్​తో పాటు స్టార బ్యాటర్ విరాట్ కోహ్లీ, వెటరన్ పేసర్ మహ్మద్ షమి దూరంగా ఉండనున్నారు. లిమిటెడ్ ఓవర్స్ నుంచి వీళ్లు రెస్ట్ తీసుకున్నారు. ఇంజ్యురీతో బాధపడుతున్న షమి.. టెస్టుల్లోనూ ఆడే అవకాశం కనిపించడం లేదు. సిరీస్ మొదలయ్యే టైమ్​కు కోలుకున్నా ఆడిస్తారని చెప్పలేం. దీర్ఘ కాలంలో అతడి అవసరం జట్టుకు ఉంది కాబట్టి ఆడించకపోవచ్చు.

సౌతాఫ్రికా సిరీస్​లో టీ20లు, టెస్టులకు టీమిండియా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. టీ20 వరల్డ్ కప్​కు ఎక్కువ టైమ్ లేదు కాబట్టి ఇప్పటి నుంచే టీమ్​ కాంబినేషన్​ను సెట్ చేసుకుంటోంది. యంగ్ ప్లేయర్స్​ను పరీక్షిస్తోంది. ఆస్ట్రేలియాతో ఇటవల ముగిసిన 5 టీ20ల సిరీస్​లో కొందరు ఆటగాళ్లు రాణించారు. సఫారీ సిరీస్​లోనూ వాళ్లు అదే ఫామ్​ను కంటిన్యూ చేస్తే టీ20 స్క్వాడ్​లో తమ ప్లేస్​ను ఫిక్స్ చేసుకోవచ్చు. వచ్చే టీ20 ప్రపంచ కప్​లో టీమిండియాకు రోహితే కెప్టెన్​గా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి మెగా టోర్నీలో అతడికి జతగా ఎవరు ఆడతారనేది కీలకం. ఇటీవల వన్డే వరల్డ్ కప్​లో శుబ్​మన్ గిల్ ఆడినా అంతగా ఆకట్టుకోలేదు. ఆసీస్​తో సిరీస్​లో ఆకట్టుకున్న యంగ్​స్టర్ యశస్వి జైస్వాల్ తన ఫామ్​ను కొనసాగిస్తే హిట్​మ్యాన్​తో కలసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది.

kohli

కంగారూలతో సిరీస్​లో రాణించిన రింకూ సింగ్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ మళ్లీ తమ సత్తాను చాటుకోవాలి. బౌలింగ్​లో వికెట్లు తీసినా ఎక్కువ రన్స్ ఇచ్చుకున్న అర్ష్​దీప్ సింగ్, ముకేశ్ కుమార్ కూడా బాగా ఆడాల్సి ఉంది. ఇలా యువకులు అందరికీ ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. అయితే సౌతాఫ్రికాతో టీ20లు, వన్డే సిరీస్​లకు కింగ్ కోహ్లీ దూరమవ్వడం మాత్రం టీమ్​ను దెబ్బతీసేలా ఉంది. సఫారీ గడ్డపై విరాట్ వన్డే యావరేజీ 76.38గా ఉంది. అదే టెస్టుల్లో అతడి యావరేజీ 51.36గా ఉంది. వన్డేల్లో ఇంత మంచి యావరేజీ ఉన్న కోహ్లీ ఆడకపోవడం టీమ్​ను ఇబ్బంది పెట్టక మానదు. యువకులతో నిండి ఉన్న టీ20 స్క్వాడ్​లో విరాట్ ఉండి ఉంటే జట్టు మరింత పటిష్టంగా తయారయ్యేది. అతడితో కలసి ఆడటం వల్ల యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకునేవారు.

kohli

సౌతాఫ్రికాలో ఎలా ఆడాలో కిటుకు తెలుసు కాబట్టి మరిన్ని సెంచరీలు కొట్టేందుకు, రికార్డులు బ్రేక్ చేసేందుకు విరాట్​కు ఛాన్స్ ఉండేది. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో అతడు టీమ్​ నుంచి తప్పుకున్నాడు. ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్​లో తీవ్రంగా అలసిపోయాడు కోహ్లీ. అతడి వయసు కూడా 36 ఏళ్లు. కాబట్టి ప్రతి టోర్నమెంట్​లో ఆడమని ఇబ్బంది పెట్టలేని పరిస్థితి. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో విరాట్​ను ఆడించాలంటే అతడ్ని కాపాడుకోవాలి. అలాగే ఫ్రెష్​గా ఉంచుకోవాలి. బహుశా అందుకే అతడు రెస్ట్ తీసుకుంటానంటే బోర్డు కూడా ఎస్ చెప్పిందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం విరాట్ వన్డే, టీ20 సిరీస్​ల్లో ఆడాల్సిందని అంటున్నారు. రికార్డులు నమోదు చేసే ఛాన్స్​ను మిస్ చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వన్డే, టీ20 సిరీస్​ల్లో ఆడొద్దని కోహ్లీ తీసుకున్న నిర్ణయం సరైందని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన కలిస్.. అంత సీన్ లేదంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి