iDreamPost

IND vs ENG: బుమ్రా అరుదైన ఘనత.. మెక్​గ్రాత్, అక్రమ్​ రికార్డు బ్రేక్!

  • Published Feb 02, 2024 | 12:51 PMUpdated Feb 02, 2024 | 12:51 PM

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్​గ్రాత్ రికార్డును భారత స్టార్ బ్రేక్ చేశాడు.

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్​గ్రాత్ రికార్డును భారత స్టార్ బ్రేక్ చేశాడు.

  • Published Feb 02, 2024 | 12:51 PMUpdated Feb 02, 2024 | 12:51 PM
IND vs ENG: బుమ్రా అరుదైన ఘనత.. మెక్​గ్రాత్, అక్రమ్​ రికార్డు బ్రేక్!

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (51 నాటౌట్), రోహిత్ శర్మ (14) కలసి తొలి వికెట్​కు 40 పరుగులు జోడించారు. మంచి స్టార్ట్ దొరకడంతో టీమ్​కు ఢోకా లేదనుకుంటున్న సమయంలో రోహిత్ ఔటయ్యాడు. అరంగేట్ర బౌలర్, 20 ఏళ్ల షోయబ్ బషీర్ హిట్​మ్యాన్​ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుబ్​మన్ గిల్ (34) బాగానే ఆడినా అండర్సన్​ అతడ్ని పెవిలియన్​కు చేర్చాడు. ప్రస్తుతం జైస్వాల్​తో పాటు శ్రేయస్ అయర్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. జట్టు స్కోరు 2 వికెట్ల నష్టానికి 103. పిచ్ నుంచి పేస్​కు మద్దతు లభిస్తుండటంతో అండర్సన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక, టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. లెజెండరీ బౌలర్లు గ్లెన్ మెక్​గ్రాత్, వసీం అక్రమ్​ను అధిగమించాడు. అతడు సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

భారత స్పీడ్​స్టర్ బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. గత 40 ఏళ్లలో బెస్ట్ బౌలింగ్ యావరేజ్ కలిగిన పేసర్ల లిస్టులో జస్​ప్రీత్ టాప్ ప్లేస్​ను దక్కించుకున్నాడు. 21.68 యావరేజ్​తో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండ్ గ్లెన్ మెక్​గ్రాత్ (21.76), సౌతాఫ్రికా దిగ్గజం అలెన్ డొనాల్డ్ (22.04) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. నాలుగో ప్లేసులో విండీస్​ వీరుడు మాల్కమ్ మార్షల్ (22.86), ఐదో ప్లేసులో సౌతాఫ్రికా వెటరన్ బౌలర్ డేల్ స్టెయిన్ (23.37) నిలిచారు. ఈ లిస్టులో మెక్​గ్రాత్​తో పాటు పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ (23.53) టాప్​లో ఉంటారని అంతా ఊహించారు. కానీ వాళ్లిద్దర్నీ బుమ్రా దాటేశాడు. మెక్​గ్రాత్ రెండో స్థానంలో ఉండగా.. అక్రమ్ ఏడో స్థానంలో ఉన్నాడు. కనీసం 300 వికెట్లు తీసిన పేసర్ల యావరేజ్​లను తీసుకొని ఈ లిస్టును తయారు చేశారు.

bumrah creates history

బెస్ట్ యావరేజ్ కలిగిన బౌలర్ల జాబితాలో బుమ్రాతో పాటు మరో భారత బౌలర్ కూడా చోటు దక్కించుకున్నాడు. అతడే సీనియర్ పేసర్ మహ్మద్ షమి. 26.06 సగటుతో 17వ స్థానంలో నిలిచాడు షమి. ఈ లిస్టులో ఎక్కువగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ బౌలర్లదే డామినేషన్ నడిచింది. అయితే మహామహా బౌలర్లను దాటి బుమ్రా ఫస్ట్ ప్లేస్​ను దక్కించుకోవడం విశేషం. ఇది చూసిన టీమిండియా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. బుమ్రా కష్టానికి, అతడు పెట్టిన ఎఫర్ట్​కు దక్కిన గౌరవం ఇది అని అంటున్నారు. ఫ్యూచర్​లో అతడు భారత్​కు మరిన్ని విజయాలు అందించాలని.. ఇలాంటి ఘనతలు ఇంకా చాలా అందుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, బుమ్రా ప్రస్తుతం ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​పై ఫోకస్ పెట్టాడు. తొలి మ్యాచ్​లో ఓడిపోవడంతో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాను గెలిపించాలని పట్టుదలతో ఉన్నాడు. మరి.. బెస్ట్ బౌలింగ్ యావరేజ్​లో మెక్​గ్రాత్​ను దాటి బుమ్రా ఫస్ట్ ప్లేస్​ దక్కించుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి