iDreamPost

4వ టెస్ట్‌కు కొత్త ప్లేయర్‌ను దింపిన ఇంగ్లండ్‌! ప్లేయింగ్‌ 11 ఇదే..

  • Published Feb 22, 2024 | 2:21 PMUpdated Feb 22, 2024 | 2:32 PM

భారత్​తో జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్​ను ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం ఓ కొత్త ప్లేయర్​ను దింపింది ఇంగ్లీష్ టీమ్.

భారత్​తో జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్​ను ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం ఓ కొత్త ప్లేయర్​ను దింపింది ఇంగ్లీష్ టీమ్.

  • Published Feb 22, 2024 | 2:21 PMUpdated Feb 22, 2024 | 2:32 PM
4వ టెస్ట్‌కు కొత్త ప్లేయర్‌ను దింపిన ఇంగ్లండ్‌! ప్లేయింగ్‌ 11 ఇదే..

భారత్-ఇంగ్లండ్ సిరీస్​ రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్​లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్​కు అంతా రెడీ అయింది. రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో దుమ్మురేపేందుకు ఇరు టీమ్స్ ప్లేయర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 2-1తో లీడ్​లో ఉన్న రోహిత్ సేనకు ఈ మ్యాచ్​ చాలా కీలకం కానుంది. ఇందులో నెగ్గితే సిరీస్​ను 3-1తో పట్టేయొచ్చు. ఆఖరి టెస్టులో పర్యాటక జట్టు గెలిచినా సిరీస్​ను సమం కూడా చేయలేదు. అందుకే రాంచీలోనే సిరీస్​ను సొంతం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే బజ్​బాల్​తో తొలుత భయపెట్టిన స్టోక్స్ సేన.. వరుసగా రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోవడంతో టెన్షన్ పడుతోంది. వరుస ఓటములు, బజ్​బాల్​ వర్కౌట్ కాకపోవడంతో ఆ టీమ్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో నాలుగో టెస్ట్​కు తమ ప్లేయింగ్ ఎలెవన్​ను ప్రకటించింది ఇంగ్లండ్.

ఎప్పటిలాగే టెస్ట్ మొదలవడానికి ఒక రోజు ముందే ప్లేయింగ్ ఎలెవన్​ను ప్రకటించింది ఇంగ్లీష్ టీమ్. రాంచీ టెస్ట్ కోసం తుదిజట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచ్​లో ఆడిన పేసర్​ మార్క్ వుడ్​ను జట్టు నుంచి తప్పించింది. సిరీస్​లో డిసైడర్​గా మారిన నాలుగో టెస్ట్ కోసం సీమర్ ఓలీ రాబిన్సన్​ను స్వదేశం నుంచి రప్పించింది. వుడ్ ప్లేసులో రాబిన్సన్ బరిలోకి దిగుతాడు. అలాగే లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్​ను కూడా తీసేసింది. అతడి ప్లేసులో యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్​ను ఫైనల్ ఎలెవన్​లోకి తీసుకున్నారు. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్​స్టో, బెన్ స్టోక్స్ బ్యాటింగ్​కు దిగుతారు. కీపింగ్ బాధ్యతల్ని బెన్ ఫోక్స్ మోస్తాడు. పేస్ రెస్పాన్సిబిలిటీని అండర్సన్, రాబిన్సన్ పంచుకుంటారు. స్పిన్నర్లుగా హార్ట్​లీ, బషీర్​కు తోడుగా రూట్ ఎలాగూ ఉన్నాడు.

రాంచీ టెస్టుకు భారత జట్టులో కూడా కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన టీమ్​ను ఇంకా ప్రకటించలేదు. ఎప్పటిలాగే టాస్ టైమ్​లోనే జట్టును ప్రకటించనున్నారు. అయితే ఈసారి టీమిండియాలో ఒక మార్పు జరగడం ఖాయం. వర్క్​లోడ్ కారణంగా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. దీంతో అతడి ప్లేసులో యంగ్ పేసర్ ముఖేష్ కుమార్ ఆడటం పక్కా అని తెలుస్తోంది. స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమ్​లోకి ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే ఇది సాధ్యం కాలేదు. గాయంతో బాధపడుతున్న అతడు పూర్తిగా రికవర్ కాకపోవడంతో రాంచీ టెస్టుకు దూరంగా ఉంచారు. కాబట్టి అతడి స్థానంలో ఆడుతున్న రజత్ పాటిదార్ ప్లేస్​కు ఢోకా లేదనే చెప్పాలి. ఈ ఒకట్రెండు తప్పితే జట్టులో పెద్దగా మార్పులు జరిగేలా కనిపించడం లేదు. మరి.. ఇంగ్లండ్​ ప్లేయింగ్ ఎలెవన్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ రోజు టీమిండియా ప్లేయర్లంతా బీఫ్‌ తిన్నారు: పాకిస్థాన్‌ క్రికెటర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి