iDreamPost

వర్షం పడకపోయినా.. భారత్- కెనడా మ్యాచ్ రద్దు.. ఎందుకంటే?

India vs Canada Match Abandoned Without Toss: భారత్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే కెనడా- భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా వేయకుండానే రద్దు అయ్యింది. ఈ వరల్డ్ కప్ టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకూడదు అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.

India vs Canada Match Abandoned Without Toss: భారత్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే కెనడా- భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా వేయకుండానే రద్దు అయ్యింది. ఈ వరల్డ్ కప్ టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకూడదు అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.

వర్షం పడకపోయినా.. భారత్- కెనడా మ్యాచ్ రద్దు.. ఎందుకంటే?

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు అంతా పొట్టి ప్రపంచ కప్ 2024 మజాని ఎంజాయ్ చేస్తున్నారు. లీగ్ మ్యాచుల్లో అన్ని జట్లు పోటా పోటీగా ఆడాయి. కొన్ని జట్లు ఇప్పటికే సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. కొన్ని జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాయి. అయితే ఈ ప్రపంచకప్ లో మాత్రం భారత్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానులకు కాస్త ఉత్సాహం ఉంటోంది. అలాంటి మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతుంది అని అంతా భయ పడ్డారు. కానీ, వర్షం కురవకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది. అంపైర్లు సుధీర్ఘ తర్జన బర్జనల తర్వాత మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా- కెనడా మ్యాచ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఈ మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా జరగాల్సి ఉంది. అయితే అక్కడ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మ్యాచ్ జరగాల్సిన లాడర్ హిల్ నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మియామిని ఇటీవలే వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ జరగాల్సిన మ్యాచులు వరుసగా రద్దవుతూ వస్తున్నాయి. ఇప్పటికే నేపాల్- శ్రీలంక, అమెరికా- ఐర్లాండ్ మ్యాచులు రద్దు అయ్యాయి. తాజాగా వరుణుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియా- కెనడా మ్యాచ్ లో కూడా టాస్ కూడా వేయకుండానే వరుణుడు విన్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో వర్షం కూడా పడలేదు. కానీ, అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉడటం కారణంగా అంపైర్స్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

అప్పటికీ సాధ్యమైనంత వరకు మ్యాచ్ నిర్వ హించేందుకు కృషి చేశారు. గ్రౌండ్స్ మన్ కూడా అవుట్ ఫీల్డ్ ని డ్రై చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. కానీ, ఎంతకీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి అంపైర్లు డిస్కస్ చేసుకుని టీమ్స్ కంటే ముందు ఈ విషయాన్ని రిఫరీకి చేరవేశారు. ఆ తర్వాత అధికారికంగా మ్యాచ్ రద్దు అయినట్లు ప్రకటించారు. ఈ ఫ్లోరిడా వేదికగా మొత్తం 4 మ్యాచులు షెడ్యూల్ చేశారు. ఇప్పటికే 3 మ్యాచులు రద్దు అయ్యాయి. రేపు(ఆదివారం) పాకిస్తాన్- ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా ఈ వేదికగానే జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ కూడా దాదాపుగా నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో భారత్ 4 మ్యాచుల్లో 3 విజయాలతో మొత్తం 7 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పటికే భారత్ సూపర్ 8కు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి