iDreamPost

ఆస్ట్రేలియాతో సెకండ్ టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

  • Author singhj Published - 04:45 PM, Sat - 25 November 23

ఆస్ట్రేలియాతో రెండో టీ20 కోసం టీమిండియా రెడీ అవుతోంది. మొదటి మ్యాచ్​లో గెలుపుతో జోష్​లో ఉన్న భారత్ తమ లీడ్​ను మరింత పెంచుకోవాలని అనుకుంటోంది.

ఆస్ట్రేలియాతో రెండో టీ20 కోసం టీమిండియా రెడీ అవుతోంది. మొదటి మ్యాచ్​లో గెలుపుతో జోష్​లో ఉన్న భారత్ తమ లీడ్​ను మరింత పెంచుకోవాలని అనుకుంటోంది.

  • Author singhj Published - 04:45 PM, Sat - 25 November 23
ఆస్ట్రేలియాతో సెకండ్ టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి టీమిండియా!

టీ20 వరల్డ్ కప్-2024 ప్రిపరేషన్స్​ను టీమిండియా విక్టరీతో స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్​లో ఫస్ట్ మ్యాచ్​లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట కంగారూ టీమ్​ను బ్యాటింగ్​కు పిలిచాడు. బ్యాటింగ్​ను అనుకూలంగా ఉన్న వైజాగ్ పిచ్ మీద ఆసీస్ ప్లేయర్లు చెలరేగిపోయారు. జోష్ ఇంగ్లిస్ (110) సెంచరీతో అలరించగా.. ఓపెనర్​గా వచ్చిన స్టీవ్ స్మిత్ (52) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆ టీమ్ 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 208 రన్స్ చేసింది. భారీ టార్గెట్​తో బరిలోకి దిగిన టీమిండియా 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

యశస్వి జైస్వాల్ (21), రుతురాజ్ గైక్వాడ్ (0) త్వరగానే పెవిలియన్​కు చేరుకున్నారు. దీంతో బ్యాటింగ్ భారం కొత్త కెప్టెన్ సూర్యకుమార్ (80) మీద పడింది. అయితే పట్టువదలని మిస్టర్ 360.. ఇషాన్ కిషన్ (58) సాయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అనంతరం వీళ్లిద్దరూ ఔటైనా రింకూ సింగ్ (22) చివరి వరకు క్రీజులో నిలబడి టీమ్​ను గెలిపించాడు. మొదటి మ్యాచ్​లో నెగ్గడంతో జోష్​లో ఉన్న భారత జట్టు.. రెండో టీ20 కోసం రెడీ అవుతోంది. ఈ మ్యాచ్​ తిరువనంతపురంలోని గ్రీన్​ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఇండియా, ఆసీస్ ప్లేయర్లు ఈ స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐదు టీ20ల సిరీస్​లో మొదటి మ్యాచ్​లో గెలిచి ఉత్సాహంలో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్​లోనూ నెగ్గి లీడ్​ను డబుల్ చేసుకోవాలని అనుకుంటోంది. మరోవైపు ఫస్ట్ టీ20లో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి తేరుకోవాలని కంగారూ జట్టు భావిస్తోంది. తృటిలో చేజారిన విజయానికి రివేంజ్ తీర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్​లో భారత టీమ్ తమ కాంబినేషన్ విషయంలో మార్పులు చేసే అవకాశం ఉంది. సెకండ్ టీ20కి ఆతిథ్యం ఇస్తున్న తిరువనంతపురం పిచ్ పేస్ బౌలింగ్​కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఎక్స్​ట్రా పేస్ ఆప్షన్​తో బరిలోకి దిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఫస్ట్ మ్యాచ్​లో ఆడిన స్పిన్ ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ ఫెయిలయ్యాడు. ఆఖర్లో చెత్త షాట్ ఆడి అతడు ఔట్ అవ్వడంతో మిగిలిన ప్లేయర్ల మీద ప్రెజర్ ఎక్కువైంది. రింకూ గనుక ఉండకపోతే మ్యాచ్ చేజారేది. ఈ నేపథ్యంలో అక్షర్​ను రెండో టీ20లో పక్కన పెట్టే అవకాశం ఉంది.

పిచ్ కూడా పేస్​కు సహకరించే ఛాన్స్ ఉన్నందున అక్షర్ స్థానంలో శివమ్ దూబేను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూబే ఉంటే మిడిలార్డర్ మరింత పటిష్టంగా తయారవుతుంది. ఒకవేళ అక్షర్​కు మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ లేదా యశస్వీ జైస్వాల్​ల్లో ఒకరు బెంచ్​కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఫస్ట్ టీ20లో తిలక్ కేవలం 12 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక, మొదటి మ్యాచ్​లో బ్యాటింగ్​లో దురదృష్టవశాత్తు రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ అయ్యాడు. కానీ మిగతా బ్యాటర్స్ అంతా మంచి ఫామ్​లో ఉన్నారు. బౌలర్లలో పేసర్ ముకేష్ యార్కర్లతో బెంబేలెత్తిస్తున్నాడు. అతడికి తోడు మిగతా వాళ్లు కూడా రాణిస్తే భారత్​కు తిరుగుండదు. మరి.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​లో ఇంకెవరు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఇకపై కూడా కెప్టెన్‌గానే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి