iDreamPost

ఫైనల్​కు చేరిన భారత జట్టు.. ఇక పాకిస్థాన్​తో తాడోపేడో..!

  • Author singhj Published - 08:01 AM, Sat - 22 July 23
  • Author singhj Published - 08:01 AM, Sat - 22 July 23
ఫైనల్​కు చేరిన భారత జట్టు.. ఇక పాకిస్థాన్​తో తాడోపేడో..!

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్​-2023లో భారత జట్టు విజయయాత్రకు అడ్డే లేకుండా పోతోంది. లీగ్​ దశలో ఓటమి అనేదే లేకుండా ఎదురు వచ్చిన ప్రత్యర్థులను చితగ్గొడుతూ వచ్చింది టీమిండియా. అదే జోరును సెమీ ఫైనల్లోనూ కొనసాగించింది మెన్ ఇన్ బ్లూ టీమ్. సెమీస్​లో బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత జట్టు 51 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. కీలకమైన మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​-ఎ 211 రన్స్​కు ఆలౌట్ అయింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన బంగ్లాదేశ్​-ఎ 160 రన్స్​కే చాప చుట్టేసింది. భారత బౌలర్లలో నిశాంత్ 5, మనవ్ 3 వికెట్లతో ప్రత్యర్థి భరతం పట్టారు.

నిశాంత్​, మనవ్​కు అభిషేక్ శర్మ, యువరాజ్​ సింగ్ దోడియా ఒక్కో వికెట్​ తీసి మంచి సహకారం అందించారు. బంగ్లాపై గెలుపుతో ఎమర్జింగ్ టీమ్స్ టోర్నీలో భారత్​ ఫైనల్​కు చేరుకుంది. ఇప్పటికే పాకిస్థాన్-ఎ​ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య కప్ కోసం ఫైట్ జరగనుంది. మామూలుగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్​ అంటే అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఫైనల్ మ్యాచ్​లో దాయాదులు తలపడితే వచ్చే కిక్ వేరనే చెప్పాలి. ఫైనల్​ ఫైట్​లో పాక్​ను చితగ్గొట్టేందుకు భారత్ జట్టు సన్నద్ధమవుతోంది.

ఇక, ఈ టోర్నీ ఫైనల్స్​కు చేరుకునే క్రమంలో సెమీ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడింది పాకిస్థాన్. శుక్రవారం జరిగిన ఫస్ట్ సెమీస్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో 322 పరుగుల భారీ స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 45.4 ఓవర్లలో 262 రన్స్​కే ఆలౌట్ అయింది. దీంతో పాక్ జట్టు 60 రన్స్ తేడాతో మ్యాచ్​లో గెలిచి ఫైనల్స్​కు చేరుకుంది. ఈ మ్యాచ్​లో పాక్ బౌలర్లలో అర్షద్ ఇక్బాల్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడికి ముబాసిర్ ఖాన్, సుఫియాన్ ముఖీమ్ చెరో రెండు వికెట్లు తీసి చక్కటి సహకారం అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి