iDreamPost

తెలుగు ప్రజలకు అలర్ట్.. 4 రోజులు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!

IMD Hyderabad- 4 Days Moderate To Heavy Rains: నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల నాలుగు రోజులు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

IMD Hyderabad- 4 Days Moderate To Heavy Rains: నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల నాలుగు రోజులు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

తెలుగు ప్రజలకు అలర్ట్.. 4 రోజులు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!

నైరుతి రుతుపవనాల కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మరో నాలుగు రోజులు పలు జిల్లాలు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ఏర్పడింది. అది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, పెద్దపల్లి, భూపాలిపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, హన్మకొండ, జనగాం, యాదాద్రి, సిద్దిపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పైగా ఈదురు గాలులు కూడా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఈనెల 19 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం నుంచి సోమవారం ఉదయం ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. అలాగే కరీనంగర్, పెద్దపల్లి, భువనగిరి, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా కాస్త తీవ్ర పరిస్థితులు ఉండే జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే గొర్రెల కాపరులు, పశువుల కాపరులు కూడా వర్షం కురిసే సమయంలో, మేఘాలు కమ్మిన సమయంలో చెట్ల కిందకు వెళ్లడం, బహిరంగ ప్రదేశాలు నిల్చోవడం, పొలాల్లో పనులు చేస్తూ ఉండటం చేయకండని హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి