iDreamPost

Kollywood: విజయ్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయను.. ఓ స్టార్ హీరో!

  • Published Feb 07, 2024 | 4:49 PMUpdated Feb 07, 2024 | 4:49 PM

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారని ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఓటు వేయనని ఓ స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు చేశారు. అతనేవరంటే..

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారని ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఓటు వేయనని ఓ స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు చేశారు. అతనేవరంటే..

  • Published Feb 07, 2024 | 4:49 PMUpdated Feb 07, 2024 | 4:49 PM
Kollywood: విజయ్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయను.. ఓ స్టార్ హీరో!

స్టార్ హీరో విజయ్ దళపతి. ఈయన పేరకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయిన తెలుగులోను విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఇక ఫ్యాన్స్ కి పండగే. అంతలా విజయ్ నటించిన సినిమాలు కొన్ని కోట్ల రూపాయిలను కలెక్ట్ చేస్తూ రికార్డ్ లు క్రియేట్ చేస్తుంటాయి. ఇటీవలే విజయ్ లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఆ వార్తలను నిజం చేసేలా విజయ్ దళపతి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాగే తన పార్టికి తమిళగ వెట్రి కజగం అనే పేరును కూడా విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఓటు వేయనని ఓ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారని తెలియగానే.. ఆయన అభిమానులు కొందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ, మరికొందరు మాత్రం విజయ్ సినిమాలకు దూరం అవుతారని బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నరంటే.. తాను ఓటు వేయనని స్టార్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకి ఆయన ఎవరంటే..తమిళ్ స్టార్ నటుడు అరవింద్ స్వామి. ప్రస్తుతం ఆరవింద్ స్వామి చేసిన ఓల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే గతంలో అరవింద్ స్వామి ఏమన్నారంటే.. తనకి సూపర్ స్టార్ రజినీకాంత్ ,కమల్ హాసన్ అంటే చాలా ఇష్టమని, అలాగే విజయ్ దళపతి అంటే కూడా చాలా ఇష్టమే కానీ, వీరు రాజకీయాల్లోకి వస్తే మాత్రం నేను ఓటు వేయను అని అన్నారు. దీనితో పాటు.. ఒక నటుడికి ప్రభుత్వ విధానాలు చేసే అర్హత ఉందని ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. అలాగే రాజకీయాల్లో నటించడం అంత ఈజీ కాదు అరవింద్ స్వామి పేర్కొన్నారు. కాగా, సినిమాల్లో హీరో ప్రజలను కాపాడినట్లు రాజకీయాల్లో చేయడం అస్సలు కుదరని పని అని, ముందు రాజకీయాల గురించి పూర్తిగా తెలుసుకొని, నేర్చుకోవడం ముఖ్యం అని చెప్పారు. దీంతో అరవింద్ స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇక విజయ్ దళపతి ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు గోట్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. కాగా, విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఈ ఇదే అయన లాస్ట్ సినిమా అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఈ విషయం పై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి, విజయ్ దళపతి కి ఓటు వేయనని అరవింద్ స్వామి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి