iDreamPost

పరీక్షకు వెళ్తుండగా విద్యార్థినికి రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న పోలీస్!

Traffic Police Saved the Student: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు రక్షించి మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్.. ఎక్కడంటే..

Traffic Police Saved the Student: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు రక్షించి మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్.. ఎక్కడంటే..

పరీక్షకు వెళ్తుండగా విద్యార్థినికి రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న పోలీస్!

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నా.. డ్రైవర్లు చేసే చిన్న తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నిత్యం ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీ చలాన్లు విధిస్తున్నా వాహనదారుల్లో మాత్రం మార్పురావడం లేదని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని ప్రాణాలు రక్షించి మానవత్వం చాటుకున్నాడు ఓ పోలీస్. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక్క నిమిషం లేట్ అయినా.. పరీక్ష కేంద్రానికి అనుమతించబోయేది లేదని విద్యాశాఖ స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేసింది. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు బయలుదేరిన విద్యార్థినికి రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఆమెను ఆస్పత్రికి తరలించి దగ్గరుండి మరీ చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థిని తన తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తుంది.

సికింద్రాబాద్ ఎంజీ రోడ్ మార్గంలో ఉన్న ఓ కాలేజ్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఉపాశంకర్ వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లీయర్ చేసి తన వాహనంలో దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకు వెళ్లి చికిత్స చేయించి.. స్వయంగా పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లారు. సాధారణంగా పోలీసులు అంటే ప్రజలకు ఒక రకమైన భయం.. వాళ్లు కఠినంగా వ్యవహరిస్తారని అభిప్రాయం. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఉపాశంకర్ చూపించిన మానవత్వానికి విద్యార్థిని ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలిసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి