iDreamPost

ప్రయాణికులకు అలర్ట్!.. మెట్రో సర్వీసులపై HYD Metro కీలక నిర్ణయం!

కొత్త సంవత్సం వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31నాడు ఆ సమయం వరకు మెట్రో ట్రైన్ లను నడిపుతామని హైదరాబాద్ మెట్రో ఎండీ ప్రకటించారు. ఆ వివరాలు మీకోసం..

కొత్త సంవత్సం వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31నాడు ఆ సమయం వరకు మెట్రో ట్రైన్ లను నడిపుతామని హైదరాబాద్ మెట్రో ఎండీ ప్రకటించారు. ఆ వివరాలు మీకోసం..

ప్రయాణికులకు అలర్ట్!.. మెట్రో సర్వీసులపై HYD Metro కీలక నిర్ణయం!

మరికొన్ని గంటల్లో 2023 కాలగమనంలో కలిసిపోనున్నది. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో మెట్రో సర్వీసులు ఆ సమయం వరకు నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో తీసుకున్న ఈ నిర్ణయంతో నగరవాసులకు ఊరట కలుగనున్నది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు బయటికి వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ మెట్రో సర్వీసులపై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31న ఆదివారం అర్ధరాత్రి 12:15 గంటల వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు. చివరి మెట్రో ట్రైన్ 12:15 గంటలకు బయలుదేరి ఒంటిగంటకు గమ్యస్థానాలకు చేరుతాయని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, ఓఆర్‌ఆర్‌పై రాకపోకలను నిలిపివేయనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 01 ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. రేపు రాత్రి 8 గంటల నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15వేల వరకు జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి